Kushi Review: ‘ఖుషి’ మూవీ రివ్యూ..

ప్రేమ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ విభిన్నంగా చూపించాలని ప్రతీ డైరెక్టర్ కోరుకుంటారు. అలా ‘ఖుషి’మూవీలో లవ్ స్టోరీ కాన్సెప్ట్ కామనే అయినా దానిని చూపించడంలో సఫలీకృతలయ్యారని సినిమా చేస్తే తెలుస్తుంది.

  • Written By: SS
  • Published On:
Kushi Review: ‘ఖుషి’ మూవీ రివ్యూ..

Kushi Review: ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి చిత్రాలను తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ.. వాటిల్లో లవ్ ఫెయిల్యూర్ ను చూపించాడు. కానీ ఈసారి సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ‘లైగర్’ తరువాత విజయ్ దేవరకొండ మాస్ హీరోకే పరిమితం అయ్యాడని అనుకుంటున్న తరుణంలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో నటించి ఆకట్టుకున్నాడు. అటు సమంత సైతం చాలా రోజుల తరువాత స్క్రీన్ పై మెరిగింది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషీ’ సెప్టెంబర్ 1న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

నటీనటులు:
విజయ్ దేవరకొండ
సమంత
మురళీ శర్మ
సచిన్ ఖేద్కర్
లక్ష్మి
శరణ్య పొన్వన్
అలీ

సాంకేతికం:
డైరెక్టర్: శివ నిర్వాణ
నిర్మాత: నవీన్, వై.రవిశంకర్
మ్యూజిక్: హేషం అబ్దుల్ వాహమ్
సినిమాటోగ్రఫీ: మురళి జి

కథ:
విప్లవ్ (విజయ్ దేవరకొండ).. బేగం(సమంత)ను బురఖాలో మొదటిసారి చూస్తాడు. తొలిచూపులోనే ఆమె తన భాగస్వామి అని ఫిక్స్ అయిపోతాడు. అయితే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆరాధ్య (సమంత) కొన్ని పరిస్తితుల వల్ల బేగంగా మారాల్సి వస్తుంది. అసలు విషయం తెలుసుకున్న విప్లవ్ ఆమె ప్రేమను పొందేందుకు చాలా కష్టపడుతాడు. మొత్తానికి విప్లవ్ ప్రేమను యాక్సెప్ట్ చేసిన ఆరాధ్య తన కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతుంది. అయితే వీరి ప్రేమకు ఆరాధ్య తండ్రి చంద్రరంగం (మురళీ శర్మ)అడ్డుపడుతాడు. ఎందుకంటే విప్లవ్ వాళ్లది నాస్తిక కుటుంబం. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండలేరని, వారి జాతకం అలా ఉందని చంద్రరంగం అంటాడు. కానీ తల్లిదండ్రులను ఎదురించి వీరు పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి తరువాత వీరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో విప్లవ్ -ఆరాధ్య కథ ఎలా సుఖంతమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
ప్రేమ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ విభిన్నంగా చూపించాలని ప్రతీ డైరెక్టర్ కోరుకుంటారు. అలా ‘ఖుషి’మూవీలో లవ్ స్టోరీ కాన్సెప్ట్ కామనే అయినా దానిని చూపించడంలో సఫలీకృతలయ్యారని సినిమా చూస్తే తెలుస్తుంది. లవ్ ఫీలింగ్ తో పాటు ఎమోషనల్ తెప్పించే సినిమా అని చెప్పవచ్చు. ఎక్కడా బోర్ కొట్టకుండా డీసెంట్ గా కథ రన్ అవుతుంది. ఫస్టాఫ్ లో ఆరాధ్య వెంట విప్లవ్ వెళ్లే సీన్స్ ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో వెన్నెల కిశోర్ తో కామెడీ ట్రాక్ అలరిస్తుంది. సెకండాఫ్ లో 30 నిమిషాల పాటు ఎమోషనల్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ఈ సినిమా నిడివి పెద్దగా ఉండడం ప్రేక్షకులు ఇబ్బంది తెప్పించే అంశం. ఒక లవ్ స్టోరీకి 2గంటల 45 నిమిషాల పాటు థియేటర్లో కూర్చోవాలంటే కష్టంగా ఫీలవుతారు. కానా నార్మల్ లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ గా మలిచి డీసెంట్ గా తీర్చిదిద్దారు.

ఎవరెలా నటించారంటే? :
విజయ్ దేవరకొండ తనలోని నటుడిని మరోసారి బయటపెట్టాడు. లైగర్ సినిమా తరువాత చాలా కూల్ నటించి ఆకట్టుకున్నాడు. గతంలో ‘గీత గోవిందం’ సినిమాలోని విజయ్ మళ్లీ కనిపిస్తాడు. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పాత్రలో లీనమైపోయింది. కమెడియన్లు తమ ట్రాక్ లో అదరగొట్టారు. తండ్రి పాత్రలో మురళీశర్మ బాగా నటించారు. మిగతా వారు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.

సాంకేతికం ఎలా ఉందంటే?
ఇప్పటి వరకు డైరెక్టర్ శివ నిర్వాణ లవ్ స్టోరీ కాన్సెప్ట్ నే ఎంచుకున్నాడు. ఇప్పుడు కూడా చిన్న పాయింట్ తో అద్భుతంగా మలిచాడు. కానీ ఈ పాయింట్ ను చెప్పడానికి ఇంతగా ఎందుకు సాగదీశారనేది అర్థం కానీ ప్రశ్న. ఈ మూవీకి ప్లస్ పాయింట్ మ్యూజిక్ అని చెప్పవచ్చు. హేషం అబ్దుల్ వాహమ్ తన పాటలతో ఇప్పటికే ప్రేక్షకులకు దగ్గరైపోయాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా మరింత ఆకట్టుకున్నాడు. చిత్రం నిర్మాణ విలువలను నవీన్, వై.రవిశంకర్ లు ఏమాత్రం తగ్గకుండా చూపించారు. కాశ్మీర్ ప్రాంతంలో చక్కటి లవ్ స్టోరీని చూపించడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదని తెలుస్తుంది.

ముగింపు:
‘ఖుషి’ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అయితే నిడివి కాస్త తగ్గిస్తే మరింత అందంగా ఉండేది.

రేటింగ్ : 2.75 /5

Recommended Video:

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు