Vijay Deverakonda: ఖుషితో అర్జున్ రెడ్డి నుంచి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ
అంతేకాకుండా ఇదే ప్రవర్తనను వరల్డ్ ఫేమస్ లవర్ అలానే లైగర్ సినిమాలో చూపించడంతో ఆ సినిమాలు కూడా డిజాస్టర్ల గా మిగిలాయి. మరోపక్క ఆయన యటిట్యూడ్ని పక్కన పెట్టి చేసిన గీతాగోవిందం సినిమా మాత్రం మంచి హిట్ సాధించింది.

Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈ హీరో సినిమాల కన్నా కూడా ఆయన యాటిట్యూడ్ కి ఎక్కువ ఫేమస్ అయిపోయారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నుంచి రియల్ లైఫ్ లో కూడా తానే అర్జున్ రెడ్డి అన్నట్టు కొన్ని ఈవెంట్స్ లో ప్రవర్తిస్తూ వచ్చారు. ఇది ఆయన అభిమానులకు సూపర్ అనిపించిన సాధారణ ప్రేక్షకులకు మాత్రం అతిగా అనిపిస్తూ వచ్చింది.
అంతేకాకుండా ఇదే ప్రవర్తనను వరల్డ్ ఫేమస్ లవర్ అలానే లైగర్ సినిమాలో చూపించడంతో ఆ సినిమాలు కూడా డిజాస్టర్ల గా మిగిలాయి. మరోపక్క ఆయన యటిట్యూడ్ని పక్కన పెట్టి చేసిన గీతాగోవిందం సినిమా మాత్రం మంచి హిట్ సాధించింది. కాబట్టి అలా ఉండదమే మీరు అనుకున్నారో ఏమో ఇప్పుడు ఖుషి సినిమాకి కూడా అదే ఫార్మేట్ ఫాలో అయ్యారు.
అంతేకాదు ఈ సినిమాకి అతికొద్ది నెగటివిటీ మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సినిమా జోనర్ పెద్దగా నెగటివ్ మాట్లాడుకునే స్కోప్ ఇచ్చే జోనర్ కాదు. ఇటువంటి సినిమాలు నచ్చకపోయినా పెద్దగా క్రిటికల్ అనాలిసిస్ చేసి ఆ సినిమాల గురించి మరి డిజాస్టర్ గా చెప్పుకునే వీలు లేదు. పైగా మ్యూజిక్, విజువల్స్, పెర్ఫార్మన్స్… లాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
అందుకే ఈ చిత్రం కథ ఆవరేజ్ గా ఉన్న, మంచి టాక్ సొంతం చేసుకుంది.
అంతే కాదు మామూలుగా విజయ్ దేవరకొండ తన సినిమాలను ఒకరకమైన హడావిడితో ప్రమోట్ చేసేవాడు. ఆ ప్రమోషన్స్ లో ఆయన యటిట్యూడ్ కూడా ఎక్కువ చూపించేవాడు. ఆ ప్రమోషన్ వల్ల విసిబిలిటీ వచ్చినా అంతే స్థాయిలో నెగటివిటీ కూడా వచ్చేది. లైగర్ అప్పుడు.. వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు సరిగ్గా అదే జరిగింది.
ఇక ఆ తప్పుల నుంచి నేర్చుకున్నారో ఏమో కానీ ఈసారి మాత్రం ఈ హీరో పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఎక్కడ కూడా అతి చేయలేదు. చాలా సైలెంట్ గా అలానే డీసెంట్ గా సినిమాని ప్రమోట్ చేశారు.
ఫైనల్ గా అర్జున్ రెడ్డి నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఇలాంటి స్టోరీ ఎంచుకోవడం అలానే ఇలా సినిమా తీయడం విజయ్ దేవరకొండకు బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇకనుంచి కూడా విజయ్ ఇదే ఫాలో అవ్వడం చాలా బెటర్.
