Vijay Devarakonda – Rashmika : ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ సంచలనం రేపుతోంది. హీరోయిన్ రష్మిక మందానకు గుడ్ బై చెప్పిన విజయ్ దేవరకొండ మరో హీరోయిన్ సమంతతో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ ఉమర్ సంధు దారుణ ఆరోపణ చేశారు. ఉమర్ సంధు ట్వీట్ వైరల్ అవుతుంది. కొన్నాళ్లుగా రష్మిక మందాన-విజయ్ దేవరకొండ ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథనాలు బలపరిచేదిగా వారి ప్రవర్తన ఉంది. గీత గోవిందం చిత్రం కోసం విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మొదటిసారి కలిశారు. డియర్ కామ్రేడ్ చిత్రంలో మరోసారి నటించారు.
ఈ టైం లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనేది పరిశ్రమ వర్గాల వాదన. లైగర్ షూటింగ్ టైం లో ముంబైలో గడిపిన విజయ్ దేవరకొండ అక్కడే ఉన్న రష్మిక మందానతో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. లేట్ నైట్ డిన్నర్స్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ మేటర్ లీకయ్యాక అడిగితే, విజయ్ నాకు మిత్రుడు కలిసి టూర్ కి వెళితే తప్పేంటని రష్మిక తిరిగి సమాధానం చెప్పారు. అదే సమయంలో మా మధ్య స్నేహం మాత్రమే, ఎఫైర్ లేదంటూ వార్తలను ఖండిస్తున్నారు.
వీళ్ళ ఎఫైర్ మీదే ఓ క్లారిటీ రాలేదు. ఈ లోగా విజయ్ దేవరకొండ కొత్త రిలేషన్ స్టార్ట్ చేశాడంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశాడు. రష్మిక మందానకు బ్రేకప్ చెప్పిన విజయ్ దేవరకొండ సమంతకు దగ్గరయ్యాడు. ఖుషి మూవీ సెట్స్ లో ఇద్దరికీ ఎఫైర్ మొదలైంది. ఖుషి చిత్ర షూట్ కోసం శ్రీనగర్ వెళ్లిన విజయ్ దేవరకొండ-సమంత ఒకే హోటల్ రూమ్ లో ఉన్నారు. వీరిది జస్ట్ టైం పాస్ లవ్ అంటూ… దారుణ ఆరోపణలు చేశారు.
ఉమర్ సంధు ట్వీట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఆయన ఆరోపణల్లో నిజమెంత అనే చర్చ మొదలైంది. ఇటీవల ప్రభాస్, సల్మాన్ వంటి టాప్ స్టార్స్ ని టార్గెట్ చేస్తూ ఉమర్ సంధు ఇదే తరహా ట్వీట్స్ వేశారు. ఆదిపురుష్ సెట్స్ లో ప్రేమించుకున్న ప్రభాస్-కృతి సనన్ మాల్దీవ్స్ లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని ట్వీట్ చేశాడు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే సల్మాన్ తో ఎఫైర్ పెట్టుకుంది. అందుకే తన ప్రొడక్షన్ లో సల్మాన్ ఆమెకు వరుస ఆఫర్స్ ఇస్తున్నారని కామెంట్స్ చేశాడు. ఉమర్ సంధు ట్వీట్స్ పై అభిమానులు మండిపడుతున్నారు
After Brokeup with #RashmikaMandanna, #VijayDevarakonda finds his New TimePass Love, Vijay fell in Love with #SamanthaRuthPrabhu during #Kushi Kashmir Schedule. They even stayed together in hotel room in Srinagar. 🔥🔥 pic.twitter.com/0Tb4PiTVWF
— Umair Sandhu (@UmairSandu) March 13, 2023