వరుస సినిమాలు ఫట్.. హీరోగా హిట్.. ఎందుకంటే!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ కాలంలోనే ఉన్నతమైన స్థానంలోకి వెళ్లిన విజయ్ దేవరకొండ సినిమాలు ఇప్పుడు వరుస ఫ్లాపులు బాట పట్టాయి. అతను తీసిన సినిమాలలో నోటా, టాక్సీవాళ, డియర్ కామ్రేడ్…ఇప్పుడు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వరుసగా వచ్చిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీలా పడ్డాయి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే…విజయ్ క్రేజ్ ఎంత మాత్రం తగ్గడంలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ ని అదేస్థాయిలో నిలుపుకుంటూ వస్తున్నాడు. తీసిన తొమ్మిది […]

  • Written By: Raghava
  • Published On:
వరుస సినిమాలు ఫట్.. హీరోగా హిట్.. ఎందుకంటే!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ కాలంలోనే ఉన్నతమైన స్థానంలోకి వెళ్లిన విజయ్ దేవరకొండ సినిమాలు ఇప్పుడు వరుస ఫ్లాపులు బాట పట్టాయి. అతను తీసిన సినిమాలలో నోటా, టాక్సీవాళ, డియర్ కామ్రేడ్…ఇప్పుడు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వరుసగా వచ్చిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీలా పడ్డాయి.

ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే…విజయ్ క్రేజ్ ఎంత మాత్రం తగ్గడంలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ ని అదేస్థాయిలో నిలుపుకుంటూ వస్తున్నాడు.

తీసిన తొమ్మిది సినిమాలతోనే అత్యంత రెమ్మ్యూనరేషన్ తీసుకునే టాప్ 10 తెలుగు సినీ హీరోల సరసన చేరాడు. ఇలా ఒక పక్క ఫ్లాపులు వస్తున్నా..ఇంకోపక్క పైపైకి ఎదుగుతూనే వెళ్తున్నాడు. దానికి కారణం అతని యాటిట్యూడ్ మరియు తనలో ఉన్న ఉత్సాహమే అని చెప్పుకోవాలి. విజయ్ ఇంకా ముందు ముందు చాలా ఉన్నత స్థానానికి వెళ్తాడని… ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్లాపులు అతని ప్రజా ఆధారణని ఎంత మాత్రము కదిలించలేవు అని చెప్పుకొస్తున్నారు. విజయ్ మున్ముందు ఎలా రాణిస్తాడో..వేచి చూడాలి.

సంబంధిత వార్తలు