Vijay Devarakonda: అసలు అనసూయ బాధేంటి… వివాదంపై ఫస్ట్ టైం నోరువిప్పిన విజయ్ దేవరకొండ!
ట్విట్టర్ లో ఎప్పుడు చుసిన అనసూయ, విజయ్ మధ్య కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, దానికి ఏమైనా పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా ? అంటూ విలేకరు అడగటంతో “గొడవ పడే వాళ్ళని అడగాలి.

Vijay Devarakonda: టాలీవుడ్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. కొన్ని కావాలని లైమ్ లైట్ లో ఉండటం కోసం చేస్తే, మరికొన్ని ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో చెప్పుకోవాల్సింది అనసూయ, విజయ్ దేవరకొండ వివాదం. అసలు వాళ్ళ మధ్య ఎందుకు వివాదం ఏర్పడింది, దానిని కారణాలు ఏమిటో కూడా సరిగ్గా తెలియదు కానీ ఎప్పుడు కూడా అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో పోరు జరుగుతూనే ఉంటుంది.
ఏదో ఒక సినిమాలో విజయ్ అన్న మాటలను పట్టుకుని అనసూయ కామెంట్స్ చేయడం, వాటికి విజయ్ ఫ్యాన్స్ రియాక్ట్ కావడం, ఆ తర్వాత విజయ్ తన పేరును ది విజయ్ దేవరకొండ అని పెట్టుకోవటం తో దాన్ని కూడా వివాదం చేస్తూ అనసూయ కామెంట్స్ చేయడం మనం చూశాం. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన “ఖుషి” సినిమా ట్రయిల్ విడుదల అయ్యింది. ఈ సమయంలో మీడియా నుంచి విజయ్ కు అనసూయ వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ట్విట్టర్ లో ఎప్పుడు చుసిన అనసూయ, విజయ్ మధ్య కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, దానికి ఏమైనా పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా ? అంటూ విలేకరు అడగటంతో “గొడవ పడే వాళ్ళని అడగాలి. ఎందుకు గొడవ పడుతున్నారో ఏమో. అక్కడ ఏమి నడుస్తుందో నాకు అసలు తెలియదు ” అంటూ చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు విజయ్. అదే సమయంలో ఇంకో ప్రశ్న కు సమాధానం ఇస్తూ, నేను ఎప్పుడు కాంట్రవర్సీ లు కావాలని కోరుకోలేదు. అలాంటివి వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో అని మాత్రమే ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.
నిజానికి విజయ్ దేవరకొండ, అనసూయ వివాదంలో నేరుగా విజయ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది లేదు. కేవలం ఆయన ఫ్యాన్స్, అనసూయ ల నడుమే వివాదం నడుస్తోంది. తాజాగా అనసూయ కూడా ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె దానికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టింది. కాబట్టి త్వరలో వీరి మధ్య వివాదం సమసిపోయే అవకాశం లేకపోలేదు
