Kushi OTT: ‘ఖుషి’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఇక కాచుకోండి..
థియేటర్లో ప్రభంజనం సృష్టించిన ‘ఖుషి’ ఓటీటీలోనూ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నమ్మకంతో ముందుగానే నెట్ ఫ్లిక్ సంస్థ సినిమా హక్కులను కొనేసింది.

Kushi OTT: విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ మూవీ ‘ఖుషి’. సమంతతో కలిసి నటించిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ స్టోరీగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. మ్యూజిక్ పరంగానూ సినిమా ఆకట్టుకోవడంతో విజయ్, సామ్ లకు మరోసారి ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ‘ఖుషి’ సక్సెస్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవారికి మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది.
థియేటర్లో ప్రభంజనం సృష్టించిన ‘ఖుషి’ ఓటీటీలోనూ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నమ్మకంతో ముందుగానే నెట్ ఫ్లిక్ సంస్థ సినిమా హక్కులను కొనేసింది. సినిమాపై వస్తున్న హోప్ ఓటీటీ ద్వారా మరింత క్రేజ్ తెప్పిస్తుందని భావిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ మూవీని అక్టోబర్ 6న రిలీజ్ చేస్తారని అంటున్నారు. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్ లో రిలీజ్ అయిన మూడు నెలల తరువాత ఓటీటీలోకి వస్తుంది. కానీ నెల రోజుల వ్యవథిలోనే దీనిని నెట్ ఫ్లిక్ష్ లో ప్రసారం చేయనున్నారు.
‘ఖుషి’పై మొదట్లో కొంత వ్యతిరేక ప్రచారం సాగింది. దీంతో విజయ్ దేవరకొండ స్పందించి సినిమా బాగున్నా.. కొందరు వ్యతిరేక రివ్యూలు రాస్తున్నారన్నారు. తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. అయితే తనకు ఫ్యాన్ష్ అండగా ఉన్నారని, తన సినిమాలు వారు ఎప్పుడూ అదరిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా ‘ఖుషి’ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన తనకు వచ్చిన రెమ్యూనరేషన్ లో ఫ్యాన్స్ కు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కొన్ని రోజుల తరువాత ఈ సినిమాకు తాను అందుకున్న పారితోషికంలో విజయ్ దేవరకొండ కోటి రూపాయలను పది మంది ఫ్యాన్ష్ కు లక్ష చొప్పున అందించి ఆకట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఖుషి’ గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చలు సాగాయి. ఇక నెట్ ప్లిక్స్ ఈమధ్య మంచి మంచి సినిమాలను దక్కించుకుంటోంది. మిగతా వాటికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి మరీ తమ సంస్థ ద్వారా సినిమాలను ప్రసారం చేస్తుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానిని ఆఫర్లు ప్రకటిస్తూ వారికి చేరువవుతోంది. తాజాగా ‘ఖుషి’ సినిమాతో తమ సబ్ స్క్రైబర్స్ పెరిగిపోతారని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు.
