Vijay Deverakonda: ఆ యాడ్ కోసం మహేష్ బాబు కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ!
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తో సపోర్టింగ్ రోల్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా విజయ్ దేవరకొండ, ఆ తర్వాత పెళ్లి చూపులు అనే సినిమా తో హీరో గా మారి మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతోనే ఆయన యూత్ లో స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించాడు.

Vijay Deverakonda: ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వాళ్ళందరికీ ఆదర్శం, ఆయనని ఆదర్శంగా తీసుకొని రవితేజ మరియు నాని వంటి హీరోలు ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలయ్యారు. కానీ వీళ్ళకి స్టార్స్ అవ్వడానికి చాలా సమయం పట్టింది, కానీ వీళ్ళ బాటలోనే వచ్చిన విజయ్ దేవరకొండ కి మాత్రం కేవలం రెండు సినిమాల సమయం మాత్రమే పట్టింది.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తో సపోర్టింగ్ రోల్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా విజయ్ దేవరకొండ, ఆ తర్వాత పెళ్లి చూపులు అనే సినిమా తో హీరో గా మారి మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతోనే ఆయన యూత్ లో స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించాడు.
ఈ సినిమా తర్వాత ‘గీత గోవిందం’ మరియు ‘టాకీవాలా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఆ తర్వాత వరుసగా ఆయనకీ రెండు భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చినా కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఒక పక్క సినిమాలతో పాటు, కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ భారీ మొత్తం లో విజయ్ దేవరకొండ డబ్బులు అందుకుంటున్న సంగతి తెలిసిందే.ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ చేసిన ‘థమ్స్ అప్’ యాడ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
మహేష్ బాబు తో కాంట్రాక్టు ఉన్నన్ని రోజులు ‘థమ్స్ అప్’ సంస్థ వారు ఒక్కో యాడ్ వీడియో కి మహేష్ బాబు కి 2 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చేవారట, కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కి ఒక్కో యాడ్ వీడియో కోసం 3 కోట్లు రూపాయిలు ఇస్తున్నారట. అప్పటికీ ఇప్పటికీ మార్కెట్ పెరిగింది కాబట్టే, మహేష్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని విజయ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.