Vijay Deverakonda- E.D: ఏదో సామెత చెప్పినట్టు లైగర్ మూవీతో విజయ్ దేవరకొండకు శని పట్టింది. ఆ మూవీతో అట్టర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్న ఈ రౌడీ హీరో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైగర్ దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు విచారించారు. లైగర్ మూవీ నిర్మాణానికి అవసరమైన నిధులు విదేశాల నుండి వచ్చాయని, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఈడీకి సమాచారం అందింది. పూరి, ఛార్మి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే అనుమానాలతో ఈడీ వారిని విచారించడం జరిగింది.

Vijay Deverakonda
లైగర్ మూవీ బడ్జెట్ ఎంత? డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి? లైగర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఆ డబ్బులు ఏం చేశారు? ఇలా పలు కోణాల్లో విచారణ జరిపారు. తాజాగా లైగర్ మూవీలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండను ఈడీ విచారిస్తున్నట్లు సమాచారం అందుతుంది.నేడు ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే విజయ్ దేవరకొండకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారట. లైగర్ మూవీకి విజయ్ రెమ్యూనరేషన్ ఎంత? పూరి-ఛార్మి ఎంత ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారు? ఇలా పలు విధాలుగా విజయ్ దేవరకొండను ప్రశ్నించనున్నారని సమాచారం.
ఈ పరిణామాలు విజయ్ దేవరకొండను అసహనానికి గురి చేస్తున్నాయట. నిజానికి విజయ్ దేవరకొండకు కూడా పూరి హ్యాండ్ ఇచ్చారనే వాదన ఉంది. దాదాపు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్ గా అగ్రిమెంట్ చేసుకున్నారట. పూరి-ఛార్మీలకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ గట్టిగా డిమాండ్ చేయలేదట. ఒప్పందం చేసుకున్న మొత్తంలో కొంత అడ్వాన్స్ గా తీసుకున్న విజయ్ దేవరకొండ మిగతాది మూవీ విడుదల తర్వాత తీసుకుంటా అన్నారట. విజయ్ దేవరకొండకు బ్యాలెన్స్ అమౌంట్ సెటిల్ చేయలేదట.

Vijay Deverakonda
లైగర్ పరాజయం సాకుగా చూపుతూ తప్పుకున్నారట. కాగా మరోవైపు బయ్యర్లతో పూరికి వివాదం నడుస్తోంది. మూవీకి బాగా హైప్ రావడంతో విజయ్ దేవరకొండ మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా అధిక ధరలకు లైగర్ చిత్రాన్ని బయ్యర్లు కొన్నారు. దారుణంగా నష్టపోయిన నేపథ్యంలో నష్టాల్లో కొంత తిరిగి చెల్లించేందుకు పూరి ఒప్పుకున్నారు. ఒప్పందం ప్రకారం పూరి డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.