Nayanthara-Vignesh Shivan: నయనతార వల్ల నా జీవితం సర్వనాశం అయ్యింది..భర్త విగ్నేశ్ సంచలన కామెంట్స్

విఘ్నేష్ సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘అంతకు ముందు ఎంతో సజావుగా సాగిపోయిన నా జీవితం…

  • Written By: Vicky
  • Published On:
Nayanthara-Vignesh Shivan: నయనతార వల్ల నా జీవితం సర్వనాశం అయ్యింది..భర్త విగ్నేశ్ సంచలన కామెంట్స్

Nayanthara-Vignesh Shivan: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి నయనతార మరియు విఘ్నేష్ దంపతులు. గత కొంతకాలం నుండి ఘాడంగా ప్రేమించుకుంటూ డేటింగ్ చేసుకున్న వీళ్లిద్దరు గత ఏడాది వివాహ బంధం ద్వారా ఒక్కట్టయ్యారు. వీళ్లిద్దరికీ ఉయిర్, ఉలగం అని ఇద్దరు కవలపిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్లిద్దరి పెళ్లి అయిపోయి అప్పుడే ఏడాది అయ్యిందట.

ఈ సందర్భంగా విఘ్నేష్ సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘అంతకు ముందు ఎంతో సజావుగా సాగిపోయిన నా జీవితం, మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అయ్యాయి, ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నాను, ఎన్నో అవమానాలు , మరెన్నో పరీక్షలు కూడా ఎదురయ్యాయి. అలా ఎన్ని ఎదురు అయ్యినప్పటికీ కూడా ఇంటికి వచ్చి నిన్ను మరియు మన పిల్లల్ని చూడగానే మొత్తం మర్చిపోతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి అహర్నిశలు కష్టపడుతాను.నిన్న గాక మొన్ననే పెళ్లి అయ్యినట్టు ఉంది అప్పుడే సంవత్సరం అయిపోయింది అంటే నమ్మలేక ఉన్నాను’ అంటూ చాలా ఎమోషనల్ ఒక ట్వీట్ వేసాడు విఘ్నేష్. విఘ్నేష్ తమిళనాడు ఒక టాప్ డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో షూటింగ్ లో పరిచయమైనా వీళ్లిద్దరు, స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

కానీ పెళ్లి జరిగినప్పటి నుండి వీళ్లిద్దరి మీద ఎదో ఒక వివాదం సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది. వీళ్లిద్దరు పిల్లల్ని సరోగసి పద్దతి ద్వారా కన్నారని, అది చట్ట రిత్యా నేరం అని కోర్టులో కేసు కూడా వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.మరి అంతిమ తీర్పు నయనతార దంపతులకు పాజిటివ్ గా వస్తుందో , లేదా నెగటివ్ గా వస్తుందో చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు