వీడియో వైరల్: మోడీ కన్నీళ్లు.. వర్మ సెటైర్లు

ఈ రాంగోపాల్ వర్మ ఉన్నాడే.. ఎప్పుడూ గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నాడు. ఈ మధ్య కరోనా లాక్ డౌన్ లో ఏ భోది వృక్షం కూర్చున్నాడో కానీ జ్ఞానోదయం అయినట్టు ఉంది. అందుకే సినిమా ఇండస్ట్రీపై , సినీ ప్రముఖులపై కౌంటర్లు తగ్గించి.. దేశంలోని సామాజిక సమస్యలపై వర్మ  ట్వీట్లు చేస్తున్నాడు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రావడానికి మోడీ నిర్లక్ష్యమే కారణమని.. 5 రాష్ట్రాల ఎన్నికలు పెట్టి.. కుంభమేళా నిర్వహించి ఇంతటి […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
వీడియో వైరల్: మోడీ కన్నీళ్లు.. వర్మ సెటైర్లు

ఈ రాంగోపాల్ వర్మ ఉన్నాడే.. ఎప్పుడూ గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నాడు. ఈ మధ్య కరోనా లాక్ డౌన్ లో ఏ భోది వృక్షం కూర్చున్నాడో కానీ జ్ఞానోదయం అయినట్టు ఉంది. అందుకే సినిమా ఇండస్ట్రీపై , సినీ ప్రముఖులపై కౌంటర్లు తగ్గించి.. దేశంలోని సామాజిక సమస్యలపై వర్మ  ట్వీట్లు చేస్తున్నాడు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ రావడానికి మోడీ నిర్లక్ష్యమే కారణమని.. 5 రాష్ట్రాల ఎన్నికలు పెట్టి.. కుంభమేళా నిర్వహించి ఇంతటి ఉపద్రవానికి కారణమని వర్మ అప్పట్లో చేసిన ట్వీట్లు చూసి అందరూ వర్మలో ఇంతటి సామాజిక సృహ వచ్చిందా? నాయనా అని ముక్కున వేలేసుకున్నారు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదంపై స్పందించే వర్మ ఈ మధ్య ప్రధాని మోడీ, బీజేపీ పాలన వైఫల్యాలు.. దేశంలో కరోనాపై సెటైరికల్ ట్వీట్లు చేస్తూ హోరెత్తిస్తున్నాడు.

తాజాగా ప్రధాని మోడీపై పడ్డాడు. మోడీ ఇటీవల వారణాసి డాక్టర్లు, వైద్యసిబ్బందితో మాట్లాడుతూ కరోనాతో ప్రాణాలు పోతున్నాయని కన్నీళ్లు పెట్టుకోవడం తెలిసిందే. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

ఆ వీడియోను మార్ఫింగ్ చేసిన వర్మ తనదైన శైలిలో మోడీకి కౌంటర్ ఇచ్చాడు. ‘మోడీ కన్నీళ్లు కార్చి ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నట్టు వీడియో తయారు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. మోడీ ఏడుపులకు వేదిక కింద ప్రముఖ హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో ఎమోషనల్ అయినట్టు.. మోడీని ఆరాధించే ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి చప్పట్లు కొట్టినట్టు వీడియోను సెటైరికల్ గా డిజైన్ చేసి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

https://twitter.com/RGVzoomin/status/1396003387536146436?s=20

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు