Rajasthan: పెళ్లికి రెడీ అయిన యువతిని కిడ్నాప్‌ చేసి ఎడారిలో ఇతడు ఏం చేస్తాడు తెలుసా?

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన యువతికి ఓ యువకుడితో జూన్‌ 12 వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పుష్పేంద్ర, అతని అనుచరులు ఆమెను కిడ్నాప్‌ చేశారు. ఎడారిలోకి తీసుకువెళ్లారు.

  • Written By: Raj Shekar
  • Published On:
Rajasthan: పెళ్లికి రెడీ అయిన యువతిని కిడ్నాప్‌ చేసి ఎడారిలో ఇతడు ఏం చేస్తాడు తెలుసా?

Rajasthan: అమ్మాయిపై మనసు పడిన యువకుడు.. ఆమెను పెళ్లికి ఒప్పించి.. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. ఇందుకోసం హీరోలు పడే కష్టాలు సినిమాల్లో కనిపిస్తాయి. అదే సినిమాల్లో అమాయికి ఇష్టం లేకపోయినా.. ఆమెను కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంది. ఒప్పించి పెళ్లి చేసుకునేది హీరో అయితే.. బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకునేవాడు విలన్‌ అవతాడు. సినిమాల్లో విలన్‌ చేసినట్లుగానే ఇక్కడ ఓ వ్యక్తి పదిమందితో కలిసి యువతిని కిడ్నాప్‌ చేశాడు. ఎడారిలోకి తీసుకెళ్లి.. గడ్డితో మంటలు వేశాడు. యువతి ఏడుస్తున్నా.. పట్టించుకోకుండా ఆమెను ఎత్తుకుని అగ్ని చుట్టూ ఏడుసార్లు తిరిగి మన పెళ్లైంది అని వదిలిపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

జూన్‌ 12న పెళ్లి నిశ్చయం..
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన యువతికి ఓ యువకుడితో జూన్‌ 12 వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పుష్పేంద్ర, అతని అనుచరులు ఆమెను కిడ్నాప్‌ చేశారు. ఎడారిలోకి తీసుకువెళ్లారు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోని పుష్పేంద్ర.. ఆమెను చేతులతో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగాడు. మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని పుష్పేంద్ర ఆమెను బెదిరించి విడిచిపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ కూడా షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కనిపించింది.

బలవంతంగా ఎత్తుకుని..
వైరల్‌ అవుతున్న వీడియోలో యువతిని తన చేతులతో ఎత్తుకున్న వ్యక్తి స్పస్టం కనిపించాడు. బాధితురాలు వదిలిపెట్టాలంటూ ఏడుస్తూ వేడుకుంటోంది. యువతి పెళ్లికి ముందు పది మంది దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లినట్టుగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలో కనిపించినట్టుగా.. వారిలో పుష్పేంద్ర ఆమెను బలవంతంగా వివాహం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆమెను ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి సప్తపది పూర్తయిందని చెప్పాడు. మనకు పెళ్లైపోయిందని, ఇంకొకర్ని పెళ్లి చేసుకోవద్దని బదిరించి వదలిపెట్టాడు.

జాడలేని కిడ్నాపర్లు..
ఈ ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా కిడ్నాపర్ల జాడలేదు. దీంతో ఆందోళనకు దిగుతామని బంధువులు హెచ్చరించారు. మరోవైపు కూతురికి న్యాయం చేయకుంటే ఆత్మాహుతి చేసుకుంటామని యువతి తండ్రి పోలీసులను హెచ్చరించాడు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వాతి మలివాల్‌ రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు