MS Dhoni- Yogi Babu: ఎవరన్నారు ధోనీకి మైనస్ పాయింట్లు లేవని.. ఇలా అడ్డంగా దొరికిపోయాడు
చాలామంది అనుకున్నట్టు ధోని జెంటిల్మెన్. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడిలోనూ కొన్ని లోపాలున్నాయి. అవి ఇప్పటివరకు బయటపడలేదు కానీ.. తమిళ హాస్యనటుడు యోగి బాబు పుణ్యమా అని అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

MS Dhoni- Yogi Babu: మహేంద్ర సింగ్ ధోని.. టీం ఇండియా క్రికెట్ చరిత్రలో ఇతడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఓటమిని, గెలుపును ఒకే విధంగా తీసుకునే ఇతడిని చూస్తే తోటి ఆటగాళ్లకే కాదు ఇతర దేశాల క్రీడాకారులకు కూడా అసూయనే. అందుకే వర్తమాన క్రికెట్లో ధోనిని జెంటిల్మెన్ క్రికెటర్ అని పిలుస్తుంటారు. ఇతగాడి సారధ్యంలోనే టీం ఇండియా ఎన్నో అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. కొన్ని కొన్ని దారుణమైన పరాభవాలను మూటగట్టుకుంది. అయినప్పటికీ కప్ గెలిచినప్పుడు చొక్కా విప్పి ఎగరలేదు. సిరీస్ చేజారినప్పుడు కళ్ల వెంట నీళ్లు పెట్టుకోలేదు. నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పుడు కూడా బాధపడలేదు. స్థిరచిత్తం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం గా నిలిచిన వాడు ధోని.
మైనస్ పాయింట్లు ఎందుకు లేవు
చాలామంది అనుకున్నట్టు ధోని జెంటిల్మెన్. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడిలోనూ కొన్ని లోపాలున్నాయి. అవి ఇప్పటివరకు బయటపడలేదు కానీ.. తమిళ హాస్యనటుడు యోగి బాబు పుణ్యమా అని అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల యోగిబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఆ కార్యక్రమానికి మహేంద్రసింగ్ ధోని తన సతీమణితో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా యోగి బాబు ధోని సమక్షంలో కేక్ కట్ చేశాడు. అయితే మొదటి ముక్కను యోగి బాబుకు తినిపించకుండా ధోని తనే తిన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన యోగిబాబు ” ఏంటన్నా ఇది.. నాకు పెట్టాలి కదా ముందు? నువ్వు తున్నావేంటి? ” అన్నట్టుగా క్యూట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీంతో యోగి బాబు బాగా అర్థం చేసుకున్న తోని కేకుముక్క అతని నోట్లో పెట్టాడు. తర్వాత యోగి బాబు కూడా ఒక చిన్న కేకు ముక్కను ధోనీకి తినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది.
నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. “ధోని ఇన్నాళ్లుగా పెట్, బైక్ లవర్ అని మాత్రమే అనుకున్నాం.. ఇప్పుడు మాత్రం ఆహార ప్రియుడు అని కూడా తెలుసుకుందాం. ఎవరైనా జన్మదిన వేడుకలకు వెళ్తే ముందుగా కేకు ముక్క వారికి పెడతారు. ధోనీ మాత్రం తనే ముందు తిన్నాడు. ధోనీ స్థిర చిత్తుడే. కానీ కేకు ముందు కాదు.” అని కామెంట్లు చేస్తున్నారు.. అన్నట్టు ఆ మధ్య ధోని క్యాండీ క్రష్ ఆడుతుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దెబ్బకు క్యాండీ క్రష్ డౌన్లోడ్స్ పెరిగిపోయాయి. యోగి బాబు జన్మదిన వేడుకల్లో ధోని చాక్లెట్ కేక్ ముక్క తిన్నాడు.. ఇప్పుడు ప్రస్తుతం ఆ కేకు అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయేమోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్ లో చెన్నై టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ.. 17వ ఎడిషన్ కప్ చెన్నై దక్కించుకునేలా కృషి చేశాడు. అంతేకాదు ఆ ప్రాంతం పై అత్యంత మక్కువ పెంచుకున్నాడు. అంతేకాదు తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా ఎంటరయ్యాడు. తన పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ఒక సినిమా కూడా తీశాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు.
View this post on Instagram
