Ashish Vidyarthi Marriage: 60 ఏళ్ల విలన్ ఆశిష్ విద్యార్థికి.. 33 ఏళ్ల రూపాలితో రెండో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?

అసోం లోని గుహాటికి చెందిన రూపాలీ బరువా ఫ్యాషన్ డిజైనర్. ఈమె కోల్ కోల్ కత్తాలో ఓ దుస్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నత మైన ఫ్యాషన్ డిజైనర్ గా రూపాలీ పేరు సంపాదించారు.

  • Written By: SS
  • Published On:
Ashish Vidyarthi Marriage: 60 ఏళ్ల విలన్ ఆశిష్ విద్యార్థికి.. 33 ఏళ్ల రూపాలితో రెండో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?

Ashish Vidyarthi Marriage: ప్రముఖ నటుడు, విలన్ పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఆశిష్ విద్యార్థి ఇదివరకే నటి శాకుంతల బరువా కుమార్తె రాజోషి అనే అమ్మాయిని 20 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్త్ అనే బాబు కూడా ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. అయితే కొంత కాలం కిందట 33 ఏళ్ల రూపాలీ బరువాతో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆశిష్ విద్యార్థి వయసు ప్రస్తుతం 60 ఏళ్లు.. ఈ వయసులో ఆయన మ పెళ్లి చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో రూపాలీ బరువా ఎవరు? ఆమె ఏం చేస్తారు? అసలు వీరిద్దరికి ప్రేమ ఎలా కుదిరింది? అనేది ఆసక్తికగా మారింది.

అసోం లోని గుహాటికి చెందిన రూపాలీ బరువా ఫ్యాషన్ డిజైనర్. ఈమె కోల్ కోల్ కత్తాలో ఓ దుస్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నత మైన ఫ్యాషన్ డిజైనర్ గా రూపాలీ పేరు సంపాదించారు. ఓ పెళ్లి వేడుకలో ఆశిష్ విద్యార్థి, రూపాలీ బరువా కలిశారు. ఆ తరువత వీరి మధ్య సన్నిహితం పెరగడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లి పెద్ద ఆడంబరంగా జరగకుండా అతికొద్దిమంది మధ్యమాత్రమే నిర్వహించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ధరించిన వీరి పెళ్లికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ ‘నా జీవితంలో రూపాలీని పెళ్లి చేసుకోవడం ఒక అనుభూతి’అని అన్నారు. అయితే ఆశిష్ విద్యార్థి సినీ ఇండస్ట్రీలో ఫేమస్ అయినందున ఆయన మొదటి వివాహం గురించి నెట్టింటా తీవ్ర చర్చ సాగుతోంది.ఇన్నేళ్లకు రూపాలీ బరువాను పెళ్లి చేసుకోవడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆయన మొదటి భార్య ఈ పెళ్లిపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఢిల్లీకి చెందిన ఆశిష్ విద్యార్థి 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చారు. ఆ తరువాత తెలుగులో ‘పాపే నా ప్రాణం’తో అడుగుపెట్టారు. ఆ తరువాత గుడుంబా శంకర్, పోకిరి, అతిథి సినిమాలతో ఫేమస్ అయ్యారు. విలన్ గానేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ గుర్తింపు పొందరు. వరుడు సినిమాలో ఆయన తండ్రి పాత్ర లో నటించి మెప్పించారు. మరోవైపు కెవ్వు కేక అనే సినిమాలో కమెడియన్ విలన్ గా మెప్పించారు. రీసెంట్ గా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లోనూ అలరించారు.