Victory Venkatesh in Jati Ratnalu 2: జాతి రత్నాలు 2 లో విక్టరీ వెంకటేష్..ఇక అభిమానులకు పండగే
Victory Venkatesh in Jati Ratnalu 2: గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సినిమాలలో ఒకటి జాతి రత్నాలు..నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఈ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా డౌన్ లో ఉంది..అలాంటి సమయం లో కూడా ఈ సినిమా అమెరికా లో 1 […]

Victory Venkatesh in Jati Ratnalu 2: గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సినిమాలలో ఒకటి జాతి రత్నాలు..నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఈ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా డౌన్ లో ఉంది..అలాంటి సమయం లో కూడా ఈ సినిమా అమెరికా లో 1 మిలియన్ మార్కుని అందుకుందంటే మాములు విషయం కాదు..అదే ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా ఆ ఫీట్ ని రిపీట్ చెయ్యలేకపోయింది..ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన అనుదీప్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..మంచి ప్రతిభ గల దర్శకుడు కావడం తో ఈయనతో సినిమాలు చెయ్యడానికి టాప్ లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ క్యూ కట్టేస్తున్నారు..ఇటీవలే తమిళం లో ఆయన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమాని తెరకెక్కించాడు..ఈ దీపావళి కి ఆ సినిమా మన ముందుకి రాబోతుంది.

Jati Ratnalu
Also Read: Anchor Anasuya: అనసూయతో ఒక రోజుకి నీ రేట్ ఎంత అని అడిగిన నెటిజన్.. అనసూయ షాకింగ్ ఆన్సర్ !
ఇది ఇలా ఉండగా అనుదీప్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా జాతి రత్నాలు సినిమా కి సీక్వెల్ లో ప్లాన్ చేస్తున్నాడు అట..ప్రస్తుతం ఒప్పుకున్నా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారట అనుదీప్..ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో తియ్యాలని ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపాడు..స్వతహాగానే అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న అనుదీప్, విక్టరీ వెంకటేష్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో తో సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..మన టాలీవుడ్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాకి ఉన్న బ్రాండ్ వేల్యూ మామూలుది కాదు..ఎంటర్టైన్మెంట్ ఫుల్లుగా ఉన్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల రేంజ్ వస్సూళ్లను రాబడుతున్న నేపథ్యం లో జాతి రత్నాలు వంటి సెన్సషనల్ హిట్ సినిమాకి సీక్వెల్..అది కూడా విక్టరీ వెంకటేష్ లాంటి హీరో తో తీస్తున్నాడు అంటే ఈ సినిమాకి ట్రేడ్ లో ఎలాంటి క్రేజ్ ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు..ఇదే కనుక అనుకున్న విధంగా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొడుతోంది అనే చెప్పాలి.

Victory Venkatesh in Jati Ratnalu 2
