MS Dhoni Farm House: అవంటే అన్నీ కోసేసుకుంటాడు.. ధోని కలెక్షన్ చూస్తే మీకు నిద్రపట్టదు
మహేంద్రసింగ్ ధోని ఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులు పిచ్చెక్కి పోతుంటారు. కోట్లాదిమంది అభిమానులు ధోని ఆటను చూసేందుకు క్రికెట్ చూస్తుంటారు. ధోనిని స్వయంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియాలకు పోటీ ఎత్తుతుంటారు. అంతటి అభిమాన గణాన్ని మహేంద్రసింగ్ ధోని సంపాదించుకున్నాడు. క్రికెట్ అంటే ధోనికి ఎంత ఇష్టమో బైకులు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం.

MS Dhoni Farm House: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బైకులు, కార్లు అంటే మహా ఇష్టం. ముఖ్యంగా బైకులు అంటే అమితంగా ఇష్టపడే ధోని.. పదుల సంఖ్యలో బైకులను సేకరించాడు. ఆ బైకులను పెట్టేందుకు ఏకంగా ఒక ఫామ్ హౌస్ ను నిర్మించాడు ధోని. ధోని సేకరించిన బైకులతో ఏకంగా ఒక షోరూం పెట్టవచ్చు అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
మహేంద్రసింగ్ ధోని ఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులు పిచ్చెక్కి పోతుంటారు. కోట్లాదిమంది అభిమానులు ధోని ఆటను చూసేందుకు క్రికెట్ చూస్తుంటారు. ధోనిని స్వయంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియాలకు పోటీ ఎత్తుతుంటారు. అంతటి అభిమాన గణాన్ని మహేంద్రసింగ్ ధోని సంపాదించుకున్నాడు. క్రికెట్ అంటే ధోనికి ఎంత ఇష్టమో బైకులు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. అందుకే ధోని మార్కెట్లోకి వచ్చే కొత్త బైక్లను తన గ్యాలరీలో చేర్చుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నాడు. మైదానంలో వికెట్ల మధ్య చిరుతలాగా పరిగెత్తే ధోని.. స్టేడియం బయట తనకిష్టమైన బైక్లను అంతే ఇష్టంగా పరుగులెత్తిస్తాడు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కార్లు కొనుగోలు చేసిన ధోని రాంచీలోని తన ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశాడు. ఆ గ్యాలరీని చూస్తే మహికి వాహనాలపై ఎంత ఇష్టం ఉందో అర్థం అవుతుంది.
గ్యాలరీలోని వాహనాలను చూసి షాక్ అయిన వెంకటేష్ ప్రసాద్..
భారత క్రికెట్ జట్టు మాజీ పెసర వెంకటేష్ ప్రసాద్ కొద్ది రోజుల కిందట రాంచీలోని ధోని ఫామ్ హౌస్ కు వెళ్ళాడు. అక్కడి వాహనాలను చూసి వెంకటేష్ ప్రసాద్ షాక్ అయ్యాడు. ఒక మనిషికి బైకులు అంటే ఇంత పిచ్చి ఉంటుంది అని తాను అనుకోలేదని ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నాడు. ఒక అంశంపై ఇంత ఉత్సాహం ఉన్న వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని, మైదానంలో ధోని మంచి ప్లేయర్ గానే తెలుసని, బయట కూడా అతను అద్భుతం అంటూ వెంకటేశ ప్రసాద్ కొనియాడాడు. రాంచి ఫామ్ హౌస్ లోని అతడి బైక్ల కలెక్షన్ చూశాక తనకు మాటలు రాలేదని వెల్లడించాడు ప్రసాద్. ఇందులో అనేక వెరైటీలు ఉన్నాయని, ఎక్కడ ఉన్న బైకులతో అత్యాధునిక షోరూం ఏర్పాటు చేయవచ్చని ప్రసాద్ చేసిన ట్వీట్ ధోని అభిమానులతోపాటు క్రికెట్ అభిమానులకు కూడా ఆసక్తిని కలిగించింది.
అవార్డుగా ఇచ్చినవి.. కొనుగోలు చేసినవి..
ధోని ఈ గ్యాలరీలో ఏర్పాటు చేసిన బైకుల్లో చాలా వరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులుగా వచ్చినవి ఉండగా, మరికొన్ని బైకులను లక్షలాది రూపాయలు వెచ్చించి ధోని ఇష్టంతో కొనుగోలు చేసుకున్నాడు. ఈ గ్యాలరీలో సుమారు వందకు పైగా బైకులు ఉన్నాయి. ఇక ధోనికి బైకు అంటే ఎంత ఇష్టమో అనేక సందర్భాల్లో అభిమానులు మైదానాల్లో కూడా చూశారు. తనకు వచ్చిన బైకులనే కాకుండా సహచరులకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా వచ్చే బైకులను ధోనీ మైదానంలో నడిపి ఆనందించిన విషయం తెలిసిందే. ధోని ఇష్టం గురించి తెలిసిన ఎంతోమంది సన్నిహితులు, బంధువులు కూడా ఖరీదైన బైకులను కొనుగోలు చేసి గిఫ్టులుగా అందిస్తుంటారు. అవన్నీ కూడా ఈ గ్యాలరీ లోనే ప్రస్తుతం ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ధోని బైకుల గురించి అభిమానులు తెలుసుకొని ఆనందిస్తున్నారు.
