‘డ్రైవింగ్ లైసెన్స్’ కోసం రామ్ చరణ్, వెంకటేష్ పాట్లు

  గత ఏడాది రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గాను కథనాయకుడిగా విక్టరీ వెంకటేష్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ సినిమాలలో నటించిన క్రెడిట్ ఎవరికైనా ఉందా అంటే అది వెంకటేష్ కే అని చెప్పుకోవాలి..ఈ […]

  • Written By: Raghava
  • Published On:
‘డ్రైవింగ్ లైసెన్స్’ కోసం రామ్ చరణ్, వెంకటేష్ పాట్లు

 

గత ఏడాది రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గాను కథనాయకుడిగా విక్టరీ వెంకటేష్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ సినిమాలలో నటించిన క్రెడిట్ ఎవరికైనా ఉందా అంటే అది వెంకటేష్ కే అని చెప్పుకోవాలి..ఈ పది సంవత్సరాలలో బాడీగార్డ్, మసాలా, దృశ్యం, గోపాల గోపాల, గురు వంటి రీమేక్ చిత్రాలలో వెంకటేష్ నటించారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న నారప్ప సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు.

తండ్రి చిరంజీవి సినిమాలకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ చిత్రం అతనిని బాగా ఆకట్టుకుంది. చూసిన వెంటనే..హుటాహుటిన ఈ చిత్ర రీమేక్ రైట్స్ కొనుగోలు చేసారు.

ఇప్పుడు ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా కథకి వెంకటేష్ సరిగ్గా సరిపోతాడని రామ్ చరణ్ భావించాడు. అందుకే వెంటకేష్ ను సంప్రదించి చక చక సినిమా పనులు ప్రారంభించాలని రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడు.

సంబంధిత వార్తలు