Gruha Pravesam: వాస్తు టిప్స్: గృహ ప్రవేశం చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
గృహ ప్రవేశం కఠినమైన చర్యలతో సంతోషకరమైన కర్మతో చేయాలి. ఇంట్లో దేవతల చిత్ర పటాలు తూర్పు దిశలో ఉంచాలి. ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడిపాదం మోపాలి. గృహ ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటి చుట్టు ఫర్నిచర్ ఉంచకూడదు. మూడు రోజులు ఇల్లు ఖాళీగానే ఉండాలి. గృహ ప్రవేశానికి వాస్తు పూజ అవసరం. ఇది రెండు దిశలను సరిగా పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇల్లు సూర్యుడు, అగ్ని, నీరు, భూమి, గాలి అనే పంచ భూతాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటిస్తేనే మంచిది.

Gruha Pravesam: మనం కొత్త ఇల్లు కట్టుకున్నా కొనుక్కున్నా నిర్ణీత ముహూర్తంలో గృహ ప్రవేశం చేయడానికి చర్యలు తీసుకుంటాం. మంచి ముహూర్తంలో మంచి సమయంలో ఇంట్లోకి ప్రవేశించాలని భావిస్తుంటాం. దీని కోసం పండితులను సంప్రదిస్తాం. గృహ ప్రవేశం చేయడానికి వసంత పంచమి, అక్షయ తృతీయ, దసరా వంటి పండగలు ప్రధానమైనవిగా అనుకుంటారు. ఉత్తరాయణం, అధిక మాసం, హోలీ వంటి వాటిని ప్రతిబంధకాలుగా చెబుతారు. గృహ ప్రవేశానికి మంచి సమయం చూసుకుని చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.
గృహ ప్రవేశం
గృహ ప్రవేశం కఠినమైన చర్యలతో సంతోషకరమైన కర్మతో చేయాలి. ఇంట్లో దేవతల చిత్ర పటాలు తూర్పు దిశలో ఉంచాలి. ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడిపాదం మోపాలి. గృహ ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటి చుట్టు ఫర్నిచర్ ఉంచకూడదు. మూడు రోజులు ఇల్లు ఖాళీగానే ఉండాలి. గృహ ప్రవేశానికి వాస్తు పూజ అవసరం. ఇది రెండు దిశలను సరిగా పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇల్లు సూర్యుడు, అగ్ని, నీరు, భూమి, గాలి అనే పంచ భూతాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటిస్తేనే మంచిది.
వాస్తు పూజ ఎందుకు చేయాలి
కొత్తగా కట్టుకున్న ఇంటికి వాస్తు పూజ చేయించడం మంచిది. వాస్తు పూజ చేయిస్తే ఏవైనా దోషాలుంటే పోతాయి. ఇంటి నిర్మాణ సమయంలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేస్తుంది. వాస్తు పూజ ఆ స్థలాన్ని శుద్ధి చేస్తుంది. ఇంట్లోకి సానకూల శక్తులు రావడానికి అవకాశాలు కల్పిస్తుంది. ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతికూల శక్తులు
ప్రతికూల శక్తులు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. వాస్తు పూజ వల్ల సానుకూల అంశాలు ఇంట్లోకి ప్రవేశించి సంతోషాలు వెల్లివిరుస్తాయి. వాస్తు సూత్రాలు పాటించకపోతే ధన నష్టం, శారీరక, మానసిక సమస్యలు వెంటాడతాయి. కొన్ని సమయాల్లో అకాల మరణం కూడ సంభవించే ప్రమాదం ఉంటుంది. అందుకే వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటించడమే మంచిది.