Confidence: వాస్తు టిప్స్: ఆత్మ విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో సూర్యుడు ఉదయిస్తున్న ఫొటో లేదా పరుగెత్తుతున్న గుర్రం ఫొటోను ఉంచుకుంటే చాలా మంచిది. నిద్ర లేచిన వెంటనే వీటిని చూడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. దీంతో ఇంట్లోని ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. గుర్రం లోపలికి పరుగెత్తుతున్నట్లు ఉంటే చాలా మేలు కలుగుతుంది.

  • Written By: Srinivas
  • Published On:
Confidence: వాస్తు టిప్స్: ఆత్మ విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Confidence: మనం ఇంట్లో అంతా మంచి జరగాలంటే వాస్తును నమ్ముతుంటాం. ఏది కూడా సవ్యంగా లేకపోతే మనకు ఇబ్బందులు రావడం సహజం దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక ఇబ్బందులు తిప్పలు పె డుతుంటాయి. దీంతో మన ఇంట్లో అన్ని వాస్తు ప్రకారం ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదైనా వాస్తు ప్రకారం లేకపోతే దాన్ని సరిచేసేందుకు చొరవ తీసుకుంటాం. వాస్తు పద్ధతులు చక్కగా పాటించి కష్టాలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

గాయత్రి మంత్రం

మనలో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్లు చూస్తుంటారు. కానీ సెల్ కు బదులు గాయత్రి మంత్రం జపిస్తే మంచి జరుగుతుంది. మనం కూర్చునే సీటు వెనుక పర్వతం ఉండే ఫొటోను ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మూగ జీవాలకు, పక్షులకు ఆహారం, నీళ్లు పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మనలో ఆత్మవిశ్వాసం పెంచే చర్యల్లో ఇవి ప్రధానంగా ఉంటాయి.

ఉదయిస్తున్న సూర్యుడు

వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో సూర్యుడు ఉదయిస్తున్న ఫొటో లేదా పరుగెత్తుతున్న గుర్రం ఫొటోను ఉంచుకుంటే చాలా మంచిది. నిద్ర లేచిన వెంటనే వీటిని చూడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. దీంతో ఇంట్లోని ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. గుర్రం లోపలికి పరుగెత్తుతున్నట్లు ఉంటే చాలా మేలు కలుగుతుంది.

కిటికీలు

మన ఇంట్లో కిటికీలు తెరిచే ఉంచాలి. దీంతో ఇంట్లో సానుకూల శక్తులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంట్లో శని యంత్రం ఉంచుకుని శని దేవుడికి పూజలు చేస్తే మంచిది. ప్రతి శనివారం శని దేవుడికి ఆవాల నూనెను నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవాలి. ఇంటికి పచ్చిమిర్చి, నిమ్మకాయలను కలిపి వేలాడ దీయడం వల్ల ప్రతికూలతలు రాకుండా ఉంటాయి. అవి ఎండిపోతే శనివారం వాటిని మార్చాలి.

గోమాతకు ఆహారం

పశువులకు పచ్చగడ్డి ఆహారంగా వేయాలి. శునకాలకు ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం, సహనం అలవడుతుంది. జంతువులకు, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో జంతువులకు ఆహారం తినిపించడం చాలా ప్రయోజనకరం.

ఉదయించే సూర్యుడు

ఇంట్లో ఉదయించే సూర్యుడి చిత్రం ఉండటం మంచిది. దానికి పూజ చేసుకోవచ్చు. సూర్యుడిని ఆరాధించాలి. సూర్య మంత్రాలను చదివి అర్జం ఇవ్వడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇలా ఇంట్లో పద్ధతులు పాటించి మనకు కలిగే ప్రతికూలతలను దూరం చేసుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు