Vastu Tips: ఇంట్లో సంతోషం ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?
ఇంటికి ప్రవేశ ద్వారం ప్రధానమైనది. ఇక్కడ నుంచే ఏదైనా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది మంచి అయినా చెడు అయినా ఇక్కడ నుంచే వస్తుంది. అందుకే ప్రవేశ ద్వారం వద్ద చెప్పులు, బూట్లు చిందర వందరగా ఉంచుకోకూడదు. చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి. తలుపు లోపల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అడ్డంకులు ఉండకూడదు.

Vastu Tips: మనం వాస్తు పద్ధతులు పాటిస్తాం. కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శ్రేయస్సు కలగాలంటే మన సంప్రదాయంలో ఇంటి డిజైన్, లే అవుట్ ప్రభావం చూపుతాయి. వాస్తు చిట్కాలు పాటిస్తే సానుకూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంట్లో అదృష్టం, సానుకూల శక్తులు కలగాలంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలి.
ప్రవేశ ద్వారం
ఇంటికి ప్రవేశ ద్వారం ప్రధానమైనది. ఇక్కడ నుంచే ఏదైనా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది మంచి అయినా చెడు అయినా ఇక్కడ నుంచే వస్తుంది. అందుకే ప్రవేశ ద్వారం వద్ద చెప్పులు, బూట్లు చిందర వందరగా ఉంచుకోకూడదు. చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి. తలుపు లోపల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అడ్డంకులు ఉండకూడదు.
రంగు
ఇంటి గోడలకు వేసే కలర్ ప్రశాంతంగా ఉండాలి. ప్రకాశవంతమైన రంగులు ఉంటే ప్రశాంతత నిలుస్తుంది. లేకపోతే చంచలత్వానికి దారి తీస్తుంది. ఇంట్లో వెలుతురు లేకుంటే కూడా అరిష్టమే. సహజకాంతి ఇంట్లో ఉంటేనే మంచి జరుగుతుంది. మృదువైన కాంతి వచ్చేలా చూడాలి. ముదురు రంగు లైట్లు అవసరం లేదు. ఇల్లు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూసుకోవడం మంచిది.
మొక్కలు
ఇంటి ఆవరణలో మొక్కలు నాటుకుంటే కూడా హాయిగా ఉంటుంది. ఇవి సానుకూల శక్తిని ఇస్తాయి. సానుకూల శక్తి పెంపొందడానికి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచితే ప్రశాంతంగా ఉంటుంది. రకరకాల పూల మొక్కలు పెంచుకుంటే వాటిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. దీంతో మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఫర్నిచర్
ఇంట్లో ఫర్నిచర్ కూడా అందంగా అలంకరించుకోవాలి. ఇది కూడా సానుకూల శక్తిని పెంచుతుంది. ఫర్నిచర్ కూడా సరైన దిశలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఏది ఎక్కడ ఉంచాలో తెలుసుకుని అమర్చుకోవాలి. లేకపోతే ఇబ్బందులొస్తాయి. ఫర్నిచర్ ను చక్కగా సర్దుకోవాలి. అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కష్టాల్లో పడతాం.