Vastu Tips Bedroom: వాస్తు టిప్స్ : పడక గది ఎలా ఉంచుకోవాలో తెలుసా?
వాస్తు ప్రకారం దంపతులు పడక గదిలో వాయువ్య లేదా నైరుతి దిశలో పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెలుతురు నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవాలి. ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ వంటివి నిద్రించే గదిలో ఉంచుకోకూడదు. మనం పడుకునే దిశ కూడా సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. తల దక్షిణం వైపు కాళ్లు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవడం మంచిది.

Vastu Tips Bedroom: మనం వాస్తును నమ్ముతాం. ఇంట్లో ప్రతీది పక్కా వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో వైవాహిక జీవితం కూడా బాగుండాలని చూసుకోవాలి. భార్యాభర్తల దాంపత్యంలో అరమరికలు లేకుండా ఉండాలంటే మనం కూడా కొన్ని పాటించాలి. ఆలుమగల మధ్య సఖ్యత చేకూరడానికి వాస్తు ప్రకారం పద్ధతులు పాటించాలి. ఇంట్లో నిత్యం గొడవలు పడుతుంటే లక్ష్మీదేవి నిలవదు.
వాస్తు ప్రకారం దంపతులు పడక గదిలో వాయువ్య లేదా నైరుతి దిశలో పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెలుతురు నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవాలి. ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ వంటివి నిద్రించే గదిలో ఉంచుకోకూడదు. మనం పడుకునే దిశ కూడా సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. తల దక్షిణం వైపు కాళ్లు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవడం మంచిది.
ఇంటికి యజమాని అయితే పడక గది నైరుతి దిశలోనే ఉంచుకోవాలి. ఉమ్మడి కుటుంబంలోని వారైతే వాయువ్య దిశలో ఉంచుకోవడం మంచిది. ఇలా పడక గది విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం చూసుకుంటే మనకు మంచి శుభాలు కలుగుతాయి. లేదంటే కష్టాలే ఎదురవుతాయి.
ఈశాన్యం వైపు బెడ్ రూం ఉంచుకోవద్దు. అలా చేస్తే మనకు అరిష్టమే. ఈశాన్యం వైపు ఏదీ ఉంచుకోవద్దు. బరువు ఉంటే మనకు కష్టాలు రావడం సహజం. పిల్లలు కావాలని అనుకునే వారు తమ పడక గది ఆగ్నేయం వైపు ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా పడక గది విషయంలో ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పక్కా వాస్తు ప్రకారం నడుచుకుంటేనే మంచిది.