Varun Tej Wedding: ఒక్కటైన వరుణ్ తేజ్-లావణ్య.. వీరి పెళ్లిలో ఇవే హైలెట్స్.. వైరల్ పిక్స్
సోమవారం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. మంగళవారం హల్దీ వేడుక జరిపారు. బుధవారం రాత్రి 7:18 వివాహ ముహూర్తం. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసి కోరుకున్న ప్రేయసిని వరుణ్ తేజ్ సొంతం చేసుకున్నారు.

Varun Tej Wedding: మెగా హీరో వరుణ్ తేజ్- హోమ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి తంతు ముగిసింది. గత మూడు రోజులుగా ఇటలీ దేశంలో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. నవంబర్ 1న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఇటలీలోని టస్కానీ వేదికగా వరుణ్, లావణ్య పెళ్లి జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంది. కొణిదెల, అల్లు ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు స్వయంగా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ చిత్రాలు షూటింగ్స్ ,షెడ్యూల్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చి సతీసమేతంగా వివాహానికి హాజరయ్యారు. అలాగే యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ సైతం పెళ్లిలో సందడి చేశారు. హీరో నితిన్, నీరజ కోన వంటి ఒకరిద్దరు చిత్ర ప్రముఖులు వరుణ్-లావణ్యల పెళ్ళికి హాజరయ్యారు.

Varun Tej Wedding
సోమవారం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. మంగళవారం హల్దీ వేడుక జరిపారు. బుధవారం రాత్రి 7:18 వివాహ ముహూర్తం. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసి కోరుకున్న ప్రేయసిని వరుణ్ తేజ్ సొంతం చేసుకున్నారు. వరుణ్ తేజ్ ఓపెంట్ టాప్ రెట్రో లగ్జరీ కారులో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. ఆయన ఎంట్రీ చాలా రాయల్ గా ఉంది. వరుణ్ రాకకోసం లావణ్య పెళ్లి పందిరిలో ఆర్తిగా ఎదురుచూసింది. లావణ్య-వరుణ్ ల వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ్-లావణ్య మొదటిసారి కలిసి నటించారు. 2017లో ఈ చిత్రం విడుదల కాగా అప్పటి నుండే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అంతరిక్షం చిత్రంలో మరోసారి జతకట్టారు. వీరి స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. నాకు ఏం ఇష్టమో తనకు తెలుసు. లావణ్యకు నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. నేను వాడే మొబైల్ కూడా ఆమె ఇచ్చిన బహుమతే అని వరుణ్ తేజ్… ఇటీవల చెప్పుకొచ్చాడు.

Varun Tej Wedding
గత రెండేళ్లుగా లావణ్య, వరుణ్ రిలేషన్ లో ఉన్నారన్న పుకార్లు వినిపించాయి. ఈ కథనాలను లావణ్య ఖండిస్తూ వచ్చారు. సడన్ గా ఈ ఏడాది నిశ్చితార్థం ప్రకటించారు. జూన్ 9న హైదరాబాద్ లో నాగబాబు నివాసంలో వరుణ్-లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది.
Day -3 started with the Bharath 💃🕺🏻 Experience the grandeur of #VarunLav 's mega wedding in Italy! Congratulations to the beautiful couple @IAmVarunTej & @Itslavanya. Wishing a lifetime of happiness! 💖 pic.twitter.com/xhZMf4u3mk
— Varun Tej Fans (@VarunTejFans) November 1, 2023
