Keerthy Suresh- Varun Dhawan: ఆ హీరోతో ఆటో రిక్షాలో కీర్తి సురేష్ హల్చల్… సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

ఈ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్యాకప్ చెప్పాక కీర్తి, వరుణ్ ధావన్ ఆటోలో తమ హోటల్స్ కి ప్రయాణం చేశారు. పబ్లిక్ లో స్టార్స్ కనిపించడంతో మీడియా కవర్ చేసింది.

  • Written By: Shiva
  • Published On:
Keerthy Suresh- Varun Dhawan: ఆ హీరోతో ఆటో రిక్షాలో కీర్తి సురేష్ హల్చల్… సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Keerthy Suresh- Varun Dhawan: కీర్తి సురేష్ ఆటోలో ప్రయాణం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విశేషం ఏమిటంటే… ఆ ఆటోలో ఆమె పక్కన ఓ యంగ్ హీరో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు వరుణ్ ధావన్. అసలు వీరిద్దరూ ఆటోలో చక్కర్లు కొట్టడమేంటనే సందేహాలు మొదలయ్యాయి. ఆరా తీస్తే అసలు విషయం బయటకొచ్చింది. కీర్తి సురేష్ ఓ హిందీ చిత్రానికి సైన్ చేశారు. ఇది ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్యాకప్ చెప్పాక కీర్తి, వరుణ్ ధావన్ ఆటోలో తమ హోటల్స్ కి ప్రయాణం చేశారు. పబ్లిక్ లో స్టార్స్ కనిపించడంతో మీడియా కవర్ చేసింది. సదరు వీడియో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడని సమాచారం. డిసెంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేస్తారట. 2024 సమ్మర్ కి థియేటర్స్ లోకి వస్తుందని సమాచారం. ఈ చిత్రంతో కీర్తి హిందీలో ఈ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

అట్లీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ థియేటర్స్ లో ఉండగా కీర్తి సురేష్ మూవీ ఆయన కంప్లీట్ చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా విడుదలైన జవాన్ వెయ్యి కోట్ల మార్క్ వైపు దూసుకెళుతుంది. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా అట్లీ జవాన్ తో మరో స్థాయికి వెళ్ళాడు. నెక్స్ట్ అట్లీ హీరో అల్లు అర్జున్ తో ఓవై చేసే ఆలోచనలో ఉన్నాడు. అనిరుధ్, అట్లీ, అల్లు అర్జున్ మూవీ ఖాయమే అంటున్నారు. ఇటీవల హింట్ కూడా ఇచ్చారు.

ఇక కీర్తి విషయానికి వస్తే ఇటీవల భోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లి పాత్రలో అలరించారు. తమిళంలో ఐదు చిత్రాల వరకూ చేస్తుంది. ఇటీవల ఆమెకు రెండు భారీ హిట్స్ పడ్డాయి. మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట అలరించింది. దసరా చిత్రంలో డీగ్లామర్ రోల్ లో మెప్పించింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు