క్యాస్టింగ్ కౌచ్‌పై వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సంచ‌ల‌న కామెంట్

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అగ్రహీరోయిన్లకు సైతం ఈ క్యాస్టింగ్ కౌచ్ లో మినహాయింపేమీ లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నింటా మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న స్టార్ల వారసురాళ్లు సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పడం గమనార్హం. స్టార్ కిడ్లకు కూడా కమిట్ మెంట్ విషయంలో మినహాయింపులేదని వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. తమిళ హీరో శ‌ర‌త్‌కుమార్ […]

  • Written By: Neelambaram
  • Published On:
క్యాస్టింగ్ కౌచ్‌పై వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సంచ‌ల‌న కామెంట్

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అగ్రహీరోయిన్లకు సైతం ఈ క్యాస్టింగ్ కౌచ్ లో మినహాయింపేమీ లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నింటా మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న స్టార్ల వారసురాళ్లు సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పడం గమనార్హం. స్టార్ కిడ్లకు కూడా కమిట్ మెంట్ విషయంలో మినహాయింపులేదని వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్ చేశారు.

తమిళ హీరో శ‌ర‌త్‌కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మి ఇండ‌స్ట్రీలోకి వచ్చి చాలా కాల‌మైంది. 25 సినిమాల్లో వివిధ‌ పాత్ర‌ల్లో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె మాట్లాడారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలోని అమ్మాయిలు మాట్లాడితే వారు అవ‌కాశాలు తగ్గుతాయా అని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చారు. ఇలాంటి వారికి అమ్మాయిలు నో చెప్ప‌డం నేర్చుకోవాలని ఆమె సూచించారు.

స్టార్ కిడ్ అయిన తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నానని వాపోయారు. అలాంటి వారు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు. అలాంటి వారి సినిమాల్లో తాను న‌టించాల్సి అవ‌స‌రం లేదనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే తనను బ్యాన్ చేశారని చెప్పింది. కాగా నేడు తన కాళ్ల‌పై నేను నిల‌బ‌డిగ‌లిగానని చెప్పింది. కౌస్టింగ్ క్యాచ్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఉందని తెలిపింది. ఇలాంటి వాటిపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలంది. మహిళలు ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని చెప్పింది.

సంబంధిత వార్తలు