Urvashi Rautela: పుష్ప 2లో ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్… అన్ని కోట్లు ఇచ్చారా? సమంత కంటే తోపా!

కాగా 2023 సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్ లో ఆమె ఇరగదీశారు. నెక్స్ట్ ఊర్వశి రాతెలా స్కంద మూవీలో సందడి చేయనుంది. రామ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేశారు. శ్రీలీల మెయిన్ లీడ్ చేస్తుంది.

  • Written By: Shiva
  • Published On:
Urvashi Rautela: పుష్ప 2లో ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్… అన్ని కోట్లు ఇచ్చారా? సమంత కంటే తోపా!

Urvashi Rautela: పుష్ప పార్ట్ 1 భారీ సక్సెస్ సాధించగా సీక్వెల్ అంతకు మించి అన్నట్లు రూపొందిస్తున్నారు. పుష్ప 2 కోసం ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పుష్ప 2 బాక్సాఫీస్ టార్గెట్ వెయ్యికోట్లని సమాచారం. ఈ సినిమా పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. ఇక పుష్ప ది రైజ్ కి సమంత ఐటెం సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఈ సాంగ్ థియేటర్లో మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. సమంత గ్లామర్, బోల్డ్ మూవ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సమంత ‘ఊ అంటావా మామ’ ఐటెం సాంగ్ చేసినందుకు రూ. 2-3 కోట్లు తీసుకున్నారని సమాచారం.

ఊ అంటావా మామ సాంగ్ కి మించి పుష్ప 2 లో ఐటెం సాంగ్ సిద్ధం చేస్తున్నారు. ఈసారి బాలీవుడ్ భామ ఊర్వశి రాతెలా చేస్తున్నారట. భారీ డిమాండ్ ఉన్న ఈ మోడల్ కమ్ యాక్ట్రెస్ ఐటెం సాంగ్ కి ఊహించని రీతిలో ఛార్జ్ చేసిందట. కేవలం మూడు రోజులు షూటింగ్ లో పాల్గొన్న ఊర్వశి రాతెలా రూ. 6 నుండి 7 కోట్లు తీసుకున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. నిర్మాతలు వెనుకాడకుండా అడిగినంత ఇచ్చారట. దీంతో సమంత కంటే ఊర్వశి తోపా, ఆమెకు అన్ని కోట్లు ఇచ్చారా? అనే చర్చ మొదలైంది.

కాగా 2023 సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్ లో ఆమె ఇరగదీశారు. నెక్స్ట్ ఊర్వశి రాతెలా స్కంద మూవీలో సందడి చేయనుంది. రామ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేశారు. శ్రీలీల మెయిన్ లీడ్ చేస్తుంది.

ఇక పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలయ్యే సూచనలు కలవు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ మూవీతో చేస్తున్నారు. ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు