
Urfi Javed
Urfi Javed: ఉర్ఫీ జావేద్ ని చూస్తే ‘ఊరందరిదొకదారి ఉలిపిగత్తిదొకదారి’ అన్న సామెత గుర్తొస్తుంది . వింతైన కాస్ట్యూమ్స్ లో జనాలను ఆకర్షించడం ఉర్ఫీ ప్రత్యేకత. టాలెంట్ లేనప్పుడు తెగింపన్నా ఉండాలి. దాన్నే ఆయుధంగా చేసుకొని పబ్లిక్ లో అందాలు ఆరబోస్తుంది. ఉర్ఫీ బట్టలు డిజైనర్ ఎవరో కానీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. క్రియేటివిటీకి పనేలేదు. ముళ్ళ కంపపై వేసి గట్టిగా లాగిన పేలికల్లా ఆ బట్టలు ఉంటాయి. అవే వేసుకుని రోడ్ల మీదకు వచ్చేస్తుంది. ఉర్ఫీ ప్రతి రోజూ ఓ సెంటర్ వెతుక్కొని కారులో నుండి దిగుతుంది. వచ్చేసిందిరా బాబు… అనుకుని ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపించేందుకు సిద్ధమైపోతారు.
ఉర్ఫీతో పరాచకాలాడుతూ ఫోటోలు తీస్తారు. నిజానికి ఆమె బట్టలు చూస్తే న్యూసెన్స్ కేసు అవుతుందనిపిస్తుంది. పిచ్చికి పరాకాష్టలా ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఉర్ఫీని చూస్తే చిన్న పిల్లలకు జ్వరం, కుర్రాళ్లకు మాయ రోగం రావడం ఖాయం. ఏలియన్స్ బట్టలు కూడా ఇంత విచిత్రంగా ఉండవేమో. ఉర్ఫీకి ఉన్న ఫేమ్ రీత్యా ఆ మాత్రం స్కిన్ షో చేయకపోతే ఫోటోగ్రాఫర్స్ దేఖరు. అందుకే మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ చూపిస్తుంది.
ఆమె తాజా డ్రెస్ చూసి నెటిజెన్స్ మూర్ఛ వచ్చి పడిపోయారు. ఇక ఉర్ఫీ టాప్ నభూతో నభవిష్యతి. యద అందాలకు ఆమె ఇచ్చిన ఎక్స్టెన్షన్ చూసి పబ్లిక్ లో టెన్షన్ మొదలైంది. బీపీ టాబ్లెట్స్ కోసం మెడికల్ షాప్స్ కి క్యూ కట్టారు. ఉర్ఫీ కారణంగా ముంబైలో అత్యవసర పరిస్థితి ప్రకటించే ప్రమాదం ఏర్పడింది. తుఫాన్, సునామీ, భూకంపం కంటే ఉర్ఫీ వింత అవతారమే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. ఇకపై ఆమె బయటికొచ్చిన కాసేపు హైఅలర్ట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు.

Urfi Javed
ఉర్ఫీ డ్రెస్ చూసాక ట్రోలర్స్ మతులు పోయాయి. ఆమెను ఏ యాంగిల్ లో ట్రోల్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియాను ఉర్ఫీ వీడియో ఊపేస్తోంది. ప్రపంచ ఎనిమిదో వింత ఇది. అది ముంబై రోడ్లపై అమ్మాయి రూపంలో తిరుగుతుందంటున్నారు. కొందరైతే ఈమె మరో గ్రహం మోడల్ అయ్యుంటుంది అంటున్నారు.
లక్నో భామ అయిన ఉర్ఫీ చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. పలు హిందీ సీరియల్స్ లో నటించారు. అసలు పేరు జావేద్ బేగం. ఉర్ఫీ జావేద్ గా మార్చుకుంది. పంచ్ బీట్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్లో నటించారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఉర్ఫీ పాల్గొన్నారు. అక్కడ ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేదు.
View this post on Instagram