
Kabzaa Review
Kabzaa Review: నటీనటులు : ఉపేంద్ర , సుదీప్ , శివ రాజ్ కుమార్, శ్రియ శరన్ , మురళి శర్మ , మనోజ్ భాజపేయ్ , ప్రకాష్ రాజ్
డైరెక్టర్ : R.చంద్రు
సంగీతం : రవి బస్రూర్
నిర్మాతలు : R .చంద్రు , అలంకార్ పాండియన్ , ఆనంద్ పండిట్
కన్నడ సినీ పరిశ్రమ ఇప్పుడు వరుసగా రెండు భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉంది.గత ఏడాది విడుదలైన KGF చాప్టర్ 2 ఏకంగా #RRR మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ ని కొల్లగొట్టి అందరిని షాక్ కి గురి చేసింది. ఆ తర్వాత అదే ఏడాది ‘కాంతారా’ అనే చిత్రం కూడా ప్రతీ భాషలో విడుదలై సంచలన విజయం సాధించింది. అలా వరుసగా రెండుసార్లు ప్రభంజనం సృష్టించేలోపు అందరికీ కన్నడ సినిమాల మీద ఆసక్తి కలిగింది. దీనితో అన్ని KGF తరహా సినిమాలే రావడం మొదలెట్టాయి. అందులో ‘కబ్జా’ ఒకటి.కన్నడ సూపర్ స్టార్స్ ఉపేంద్ర , సుదీప్ కలిసి నటించిన ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు ఆ చిత్ర దర్శకుడు R.చంద్రు.ప్రొమోషన్స్ కూడా భారీగానే చేసాడు. కానీ మొదటి నుండి ఈ చిత్రాన్ని ఎంత ప్రమోట్ చేసిన హైప్ రాలేదు. అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి మూవీ మరో KGF లాగ ఉందా, లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
కథ:
అరకేశ్వర (ఉపేంద్ర) అనే అతను ఒక పెద్ద మాఫియా డాన్, కానీ అతని తండ్రి మాత్రం ఫ్రీడమ్ ఫైటర్.దేశం కోసం ఎంతోమంది ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. అలాంటి దేశభక్తుడి కొడుకైన అరకేశ్వర మాఫియా లోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఏమిటి. ఎలాంటి పరిస్థితిలు అతనిని డాన్ అయ్యేలా చేసింది, చివరికి తండ్రి లాగానే అతను ఫ్రీడమ్ ఫైటర్ అయ్యాడా, లేదా మాఫియా డాన్ గానే కొనసాగాడా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఈ చిత్ర దర్శకుడు R.చంద్రు కి KGF సిరీస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. మక్కికి మక్కీ అదే టేకింగ్ తో మన ముందుకు వచ్చాడు.కానీ KGF తెలుగు వెర్షన్ ఆ రేంజ్ లో ఎలివేట్ అవ్వడానికి కారణం డబ్బింగ్.’కబ్జా’ సినిమాకి డబ్బింగ్ అసలు కలిసి రాలేదు. డైలాగ్స్ కూడా అంతంతమాత్రం గానే ఉన్నాయి.ఇక KGF సిరీస్ కి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించాడు. కానీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం మనకి KGF చిత్రానికి వాడినదే తిప్పి మనకి కూడా కొట్టాడు అనిపిస్తాది. సినిమాటోగ్రఫీ కూడా కేజీఎఫ్ తరహాలో డార్క్ షేడ్స్ లో ఉంటుంది. ఇలా అన్ని విషయాల్లోనూ KGF ని డైరెక్టర్ బాగా అనుసరించాడు కానీ , స్క్రీన్ ప్లే ని అంతే వేగవంతంగా మాత్రం నడిపించలేకపొయ్యాడు.

Kabzaa Review
ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడే ఇంత స్లో గా సినిమా నడుస్తుందేంటి అనే ఫీలింగ్ వస్తుంది. కనీసం సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అనుకుంటే అది మరీ రొటీన్ గా ఉంటుంది. అయితే సినిమా మొత్తానికి పెద్ద ప్లస్ ఏదైనా ఉందా అంటే అది ఉపేంద్ర నటనే అని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో వింటేజ్ ఉపేంద్ర ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక అతిథి పాత్రలో మరో కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కేవలం పది నిముషాలు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తాడు. ఆయన పాత్ర సినిమాలో ఇంకా కొంచెం పెంచి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక శ్రీయ శరన్ కూడా తన పరిధిమేర పర్వాలేదనే అనిపించింది. డైరెక్టర్ కథని పేపర్ మీద బాగా రాసుకున్నాడు కానీ, ఎగ్జిక్యూషన్ లో మాత్రం తడబడ్డాడు. ఇదే స్టోరీ ప్రశాంత్ నీల్ తీసి ఉంటే KGF కంటే గొప్ప ఔట్పుట్ వచ్చేదని చూసే ప్రతీ ఒక్కరికీ కలిగే ఫీలింగ్.
చివరి మాట :
అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం బాగా నిరాశకి గురి అవుతారు.అంచనాలు లేకుండా వెళ్తే కాస్త సంతృప్తి చెందుతారు.మొత్తానికి ఈ సినిమా ఉపేంద్ర ఫ్యాన్స్ కి నిరాశే కలిగించింది.
రేటింగ్ : 2.25 /5