Upasana : కోట్ల విలువైన ఏర్పాట్లు… చరణ్ కూతురు ఎలాంటి వాతావరణంలో పెరగనుందో తెలుసా?
ఉపాసన దోమకొండ ఆస్థానం వారసురాలు. వారి పూర్వీకులు రాజసం అనుభవించారు. ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ టైకూన్స్ గా అవతరించారు. ఉపాసన కూతురిగా క్లిన్ కార యువరాణినే అని చెప్పాలి.

Upasana : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు… కోటీశ్వరులు కోరుకుంటే రానిది ఏముంది చెప్పండి?. రామ్ చరణ్, ఉపాసన తమ బిడ్డ క్లిన్ కార కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే మతిపోతుంది. బిడ్డ పుట్టడానికి ముందే ఎలాంటి వాతావరణంలో పెరగాలి, ఆడుకునే పరిసరాలు ఎలా ఉండాలో డిజైన్ చేయించారు. క్లిన్ కార రూమ్ ప్రత్యేకంగా మలిచారు. ఇందుకు ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ సంస్థ పని చేసింది. ఆర్క్టెక్చురల్ డైజెస్ట్ ఇండియా అనే సంస్థకు చెందిన పవిత్ర రాజన్ ఈ గదిని డిజైన్ చేశారు.
నర్సరీ పేరుతో రూపొందించిన ఈ రూమ్ వాల్స్ కి ఫారెస్ట్ థీమ్ ఎంచుకున్నారు. జంతువులు, పక్షులు, చెట్లతో ఆకర్షణీయంగా అందమైన రంగుల్లో రూపొందించారు. ముదురు రంగులు వాడకుండా చాలా డీసెంట్ అండ్ ప్లెజెంట్ గా రూపొందించారు. క్లిన్ కార కోసం సదరు నర్సరీని సిద్ధం చేసినట్లు ఉపాసన తెలియజేశారు. ఆ గది రూపకల్పన ఎలా జరిగిందో ఒక వీడియో ద్వారా తెలియజేశారు. క్లిన్ కార పెరిగే గది కోసం ఉపాసన దంపతులు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
ఉపాసన దోమకొండ ఆస్థానం వారసురాలు. వారి పూర్వీకులు రాజసం అనుభవించారు. ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ టైకూన్స్ గా అవతరించారు. ఉపాసన కూతురిగా క్లిన్ కార యువరాణినే అని చెప్పాలి. అందుకే క్లిన్ కార పుట్టినప్పటి నుండే రాజభోగాలు అనుభవిస్తున్నారు. పుట్టి కనీసం నెల కూడా గడవకుండానే ఇన్ని సౌకర్యాలా అని జనం ఆశ్చర్యపోతున్నారు.
జూన్ 20న ఉపాసన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. అన్నప్రాసన జరిపి క్లిన్ కార అని పేరు పెట్టారు. లలితా సహస్ర నామంలోని పదాలను తీసుకుని క్లిన్ కార అని నామకరణం చేశారు.2012లో ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పుడే ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందట. పదేళ్ల వరకు సంతానం వద్దనుకున్నారట. అన్నమాటకు కట్టుబడి ఉపాసన-చరణ్ ఆలస్యంగా తల్లిదండ్రులు అయ్యారు.
Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing.
Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL— Upasana Konidela (@upasanakonidela) July 14, 2023
