Unstoppable With NBK – Prabhas : ‘ఏందీ నువ్వు అందరినీ బెదిరించేస్తున్నావు’ అంటూ ప్రభాస్ పై అరిచిన బాలయ్య..వైరల్ అవుతున్న లేటెస్ట్ ప్రోమో
Unstoppable With NBK Bahubali Prabhas :ఆహా మీడియా లో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ టాక్ షోగా అవతరించింది.. మొదటి సీజన్ ని మించి రెండో సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ , పవన్ కళ్యాణ్, […]

Unstoppable With NBK Bahubali Prabhas :ఆహా మీడియా లో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ టాక్ షోగా అవతరించింది.. మొదటి సీజన్ ని మించి రెండో సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉన్నారు.
ఇప్పటి వరకు ప్రభాస్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఈ షో కి విచ్చేసారు..మహేష్ బాబు ఎపిసోడ్ మొదటి సీజన్ లోనే టెలికాస్ట్ అయ్యింది.. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది..త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా రాబోతుంది..అయితే ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించిన రెండో భాగం జనవరి ఆరవ తేదీన ప్రసారం కానుంది..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఈరోజు విడుదల చేసారు.
ఈ ప్రోమో లో ప్రభాస్ తో పాటుగా గోపీచంద్ కూడా ఉన్నాడు..గోపీచంద్ మొదటి ఎపిసోడ్ లో రాలేదు..చివర్లో వస్తాడు..ఇప్పుడు రెండవ ఎపిసోడ్ మొత్తం వీళ్ళిద్దరితో బాలయ్య బాబు చిట్ చాట్ చెయ్యబోతున్నాడు..అయితే మొదటి ఎపిసోడ్ లో ఫోన్ కాల్ ద్వారా రామ్ చరణ్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో ఆటపట్టిస్తాడో మన అందరికీ తెలిసిందే..రెండో ఎపిసోడ్ లో కూడా గోపీచంద్ కూడా ప్రభాస్ ని అలాగే ఆటపట్టించే ప్రయత్నం చేస్తాడు.
అప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ ‘రేయ్..ఏదైనా చెప్పాలనుకుంటే పూర్తిగా చెప్పేయ్..ఇలా సగం సగం చెప్పొద్దూ’ అంటూ బెదిరిస్తాడు.. అప్పుడు బాలయ్య బాబు ప్రభాస్ తో మాట్లాడుతూ ‘ఏంటి నువ్వు అందరిని బెదరించేస్తున్నావు’ అని అంటాడు.. అలా సరదాగా సాగిపోతున్న ఈ ఎపిసోడ్ లో బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఎదురైనా ఫ్లాప్స్ గురించి అడుగుతాడు..ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలి.
