Unstoppable Season 2- TDP: బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సక్సెస్ గా రన్ అవుతోంది. సినీ, రాజకీయ సెలబ్రెటీలు ఈ ప్రోగ్రాం కి అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు. అయితే రాజకీయంగా మాత్రం నందమూరి బాలకృష్ణ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ షో వేదికగా తనకు అనుకూల పార్టీ అయిన టీడీపీకి జాకీ పెట్టేందుకు ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభమైనప్పటి నుంచి మాజీ సీఎం చంద్రబాబు, లోకేశ్ వచ్చారు. మిగతా రాజకీయ నాయకులకు ఎంట్రీ లేదు అన్నట్లు బాలకృష్ణ వ్యవహరిస్తున్నాడు అని అంటున్నారు. అయితే తాజాగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యాురు. అయితే ఆయనను ఏపీకి చెందిన కొన్ని వివాదాస్పద విషయాలపై ప్రశ్నలు వేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. దీంతో బాలయ్యపై విమర్శలు మొదలయ్యాయి.

balakrishna
ఓ వైపు సినిమాల్లో కొనసాగుతూ మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు బాలకృష్ణ. ఇప్పుడు హోస్ట్ అవతారం ఎత్తి అన స్టాపబుల్ షో ను రన్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గెస్టులను తీసుకొస్తున్నారని అంటున్నారు. మాజీ సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా ప్రశ్నలు వేసి వారి మెప్పు పొందారని అంటున్నారు. ఇప్పుడు ఇతర పార్టీల నాయకులను తీసుకొచ్చి ఇరుకున పెడుతున్నారని విమర్శిస్తున్నారు.
లేటేస్టుగా ఈ షో కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఒకప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు క్రీయాశీలక రాజకీయాల్లో లేకున్నా.. ఆయననుకొన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగారు. మూడు రాజధానుల విషయంలో మీ అభిప్రాయమేంటి..? అని అడిగారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు.. అని సమాధానం ఇచ్చారు. దీంతో ప్రోమో అక్కడికే కట్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.

balakrishna
అయితే పూర్తిగా ఒకే వైపు ప్రశ్నలు అడుగుతున్నారని కవర్ చేయడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగిడే ప్రయత్నం చేశారు. కానీ మొత్తంగా చూస్తే ఈ షో టీడీపిక అనుకూలంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎల్లో పార్టీకి కొన్ని మీడియాలు వంత పాడుతున్నాయి. ఇవి చాలావా అన్నట్లుగా ఇప్పుడ అన్ స్టాపబుల్ షో కూడా తోడైందని చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి విమర్శలు కొనసాగుతాయా..? వీటిపై బాలయ్య ఏ విధంగా స్పందిస్తాడు..? అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.