USA : అమెరికా రాజధానిపై వివాదాస్పద విమానం.. వెంటాడిన జెట్స్.. ఉలిక్కిపడిన అగ్రరాజ్యం
వాషింగ్టన్ మీదుగా ప్రయాణం చేసిన ఆ బిజినెస్ జెట్ విమానం వర్జీనియాలోని ఓ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. అత్యంత వేగంతో ప్రయాణించిన ఆ విమానం అమాతం అటవీ ప్రాంతంలో నేలకూలినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.

USA : శుత్రుదుర్భేద్యమైన అమెరికా గగనతలంలో ఓ ఫైటర్ జెట్ విమానం కలకలం రేపింది. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్‌లో గగనతలంలో అత్యంత స్వల్ప ఎత్తులో జనాలకు అతి దగ్గరగా చక్కర్లు కొట్టింది. ఇది అనుమానాస్పదం కన్పించడటంతో అప్రమత్తమైన అమెరికా రక్షణ విభాగం.. ఎఫ్-16 యుద్ధ విమానంతో ఆ ఫైటర్ జెట్‌ను వెంబడించింది. దీంతో వాషిగ్టంటన్ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సెప్టెంబరు 11 లాంటి ఘటనకు ఎవరైనా ఉగ్రవాదులు పన్నాగం పన్నారా అంటూ ఆందోళన చెందారు. అమెరికన కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం టెన్నీసి నగరంలో ఎలిజబెత్ టౌన్ ప్రాంతంలో ఓ బిజినెస్ జెట్ టేకాఫ్ అయింది. లాంగ్ ఐలాండ్(న్యూ యార్క్) నుంచి మెక్ ఆర్థర్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్న ఆ బిజినెస్ జెట్ అనూహ్యంగా తన దిశ మార్చుకుంది. లాంగ్ ఐలాండ్ గగనతలంలో ప్రవేశించింది. అక్కడ కొంత సేపు చక్కర్లు కొట్టింది. ఉన్నట్టుండి వాషింగ్టన్‌లోకి ప్రవేశించింది.
సున్నిత ప్రాంతం
భద్రతాపరంగా అత్యంత సున్నితమైన వైట్ హౌస్, యూఎస్ క్యాపిటల్ ఏరియాలో చక్కర్లు కొట్టింది. వెంటనే అప్రమత్తమైన యూఎస్ రక్షణ విభాగం దానిని వెంబడించేందుకు ప్రయత్నించగా.. దాని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అమెరికా రక్షణ దళానికి చెందిన ఎఫ్-6 యుద్ధ విమానం దానిని వెంబడించింది. సాధారణంగా యుద్ధ విమానాలు జనసముదాయంలో నిర్ణీత వేగంతో ప్రయాణిస్తాయి. అంతటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇదే తీరుగా యుద్ధ విమానాలు ప్రయాణించాయి. అత్యవసర సమయంలో మాత్రమే ఫైటర్ జెట్ మాత్రం సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే జనసమూహం నుంచి అత్యంత సమీప ఎత్తు నుంచి వెళ్తాయి. వాషింగ్టన్‌లో బిజినెస్ జెట్ అనుమనాస్పదంగా కన్పించడంతో దాన్ని వెంబడించేందుకే ఎఫ్-16 యుద్ధ విమానంలో భారీ శబ్దంతో గాల్లోకి ఎగరాల్సి వచ్చింది. అది ఎగిరే వేగానికి భారీ శబ్దాలు వచ్చాయి. వర్జీనియా, మేరీల్యాండ్, వాషింగ్టన్ వరకు ఈ శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తాము వెంబడిస్తున్న విషయాన్ని బిజినెస్ జెట్ పైలెట్‌కు అర్థమయ్యేందుకు ఎఫ్-16 యుద్ధ విమానం నుంచి మంటలు కూడ వదిలారు. ఆ మంటలను చూసిన స్థానికులు భయంతో ఇళ్లల్లోకి పరుగులు తీశారు.
కుప్ప కూలింది
వాషింగ్టన్ మీదుగా ప్రయాణం చేసిన ఆ బిజినెస్ జెట్ విమానం వర్జీనియాలోని ఓ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. అత్యంత వేగంతో ప్రయాణించిన ఆ విమానం అమాతం అటవీ ప్రాంతంలో నేలకూలినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. నిమిషానికి 30 అడుగులు కిందకు వచ్చి నేల కూలిందని ఫ్లైట్ ట్రాకింగ్ సైట్లు నిర్ధారించాయి. అయితే ఈ విమానం ఫ్లోరిడాలోని ఎన్‌కోర్ మోటార్స్ అనే సంస్థ పేరటి రిజిష్టర్ అయింది. ఈ కంపెనీ యజమాని జాన్ రాంపెల్ ఈ ఘటనపై స్పందించారు. ఆ విమానంలో తన కుమార్తె, రెండు సంవత్సరాల వయసు ఉన్న మనవరాలు, ఆయా, పైలెట్ ఉన్నట్టు ఆయన వివరించారు. తనను చూడటానికి వచ్చిన వారంతా.. ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారని ఆయన వెల్లడించారు. కాగా, ఘటనాస్థలంలో ఎవరూ ప్రాణాలతో కన్పించలేదని వర్జీనియా పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద గోల్ఫ్ ఆడుతున్నారు. ఈ ఘటన వల్ల అతడి షెడ్యూల్ ప్రభావితం కాలేదని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. గోల్ఫ్ అనంతరం ఆయన ఈ సంఘటన గురించి వివరించామని అమెరికన్ అధికారులు వెల్లడించారు.
