శివాజీ రావ్ గైక్వాడ్ అనే నల్లటి బస్ కండక్టర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అవుతాడని తెలియని రోజులు అవి. ఒక విధంగా రజనీకాంత్ గా తాను మారతాను అని కూడా ఆ నల్లటి పొడవాటి మనిషికి తెలియని రోజులు అవి. నిజానికి అప్పుడు ఆ కుర్రాడు బతకడానికి చాలా కష్టపడుతున్న రోజులవి. ఆ మాటకొస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని రోజులు అవి. ఆ సమయంలో రజనీ కేవలం 10 పైసల కూలీకి బెంగుళూరులో బియ్యం బస్తాలు మోస్తూ కడుపు నింపుకుంటూ ఎన్నో అవమానాలతో సతమతమవుతున్న కాలం అది. అలాంటి టైంలోనే తన అన్నయ్య సహకారంతో రజిని బస్ కండక్టర్ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
Also Read: చరణ్ తో మరో స్టార్ హీరో.. త్రివిక్రమ్ కొత్త ఆలోచన !
బెంగుళూరు టాన్స్ పోర్ట్ సర్వీస్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడై కండక్టర్ జాబ్ కూడా సంపాదించి.. కుటుంబానికి అండగా నిలబడ్డారు. అప్పుడు రజినికి పెళ్లి చేయాలని అనుకున్నారట ఆయన కుటుంబం. కానీ కండక్టర్ కి పిల్లని ఎవరు ఇస్తారు అంటూ దగ్గర బంధువులు కూడా రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్ ను తీవ్రంగా అవమానించారు. అప్పుడే రజినిలో పట్టుదల పెరిగిందట. తన జీవితం బస్ జర్నీతోనే ఆగకూడదు అని నిర్ణయించుకున్న రజిని.. నటుడు కావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.
కాగా బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీసులో డ్రైవర్ రాజా బహదూర్ అనే వ్యక్తి కూడా జాయిన్ అయ్యాడు. అతనితో కలిసి రజనీకాంత్ సర్వీస్ చేసేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే రజనీకాంత్ స్పీడుగా టిక్కెట్లు ఇవ్వడం, అలాగే చిల్లరను కూడా తనదైన స్టైల్ లో ఇచ్చే విధానాన్ని గమనించిన రాజా బహదూర్ రజినిలో హీరోని చూశాడు. ఒకవిధంగా రాజా పొగడ్తలు వల్లే రజినిలో తనలో నటుడు ఉన్నాడని రజినికి నమ్మకం కలిగిందట. అప్పుడే నటుడిగా కొత్త ప్రయాణాన్ని వెతుక్కుంటూ గ్రేట్ డైరెక్టర్ బాలచంద్ర దగ్గరకి వచ్చి పడ్డాడు. ఏకంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు.
Also Read: ‘పూజా హెగ్డే’ కొత్తగా.. ఆచార్య కోసమే !
అన్నట్టు రజనీకాంత్ తన సినీ జీవితాన్ని మొదలు పెట్టకముందు అంటే.. కండక్టర్ గా కూడా మారకముందు సాధారణ వ్యక్తిగా రజిని జీవన విధానం ఉండేది కాదు అట. ఆఫీస్ బాయ్ గా, కూలీగా, కార్పెంటర్ గా కూడా రజిని పని చేసాడు. ఈ విషయాలను స్వయంగా రజనీకాంత్ నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్