Ram Charan – Amith Shah : ఢిల్లీలో ఇండియా టుడే చానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్ కి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లభించినందుకు రాంచరణ్ హాజరయ్యారు. వీరిద్దరితో ఇండియా టుడే ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అమిత్ షాతో రాంచరణ్,చిరంజీవిలు ప్రత్యేకంగా భేటి అయ్యారు.
అమెరికా నుంచి నేరుగా రాంచరణ్ ఢిల్లికి రాగా.. హైదరాబాద్ నుంచి అమిత్ షాను కలవడానికి చిరంజీవి ఢిల్లీ వెళ్లారు. ఇండియా టుడే కార్యక్రమం పూర్తయ్యాక రాంచరణ్, చిరంజీవి కలిసి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్ షా ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చినందుకు రాంచరణ్ నటనకు గాను ఆయనను శాలువాతో సన్మానించారు.
“ఢిల్లీ పర్యటనకు వచ్చిన మాజీ కేంద్రమంత్రి, అగ్రనటుడు కొణిదెల చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సందర్భంగా చిరంజీవిని సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు.