Pooja Hegde: పాపం పూజ హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా తయారు అయ్యింది ఏంటి! ఆమె పని అయిపోయినట్టేనా?

Pooja Hegde: సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే..నాగ చైతన్య హీరో గా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయం లోనే చూస్తుండగానే టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే ఈమె బాలీవుడ్ లో అవకాశాలు సాధించి ఏకంగా హృతిక్ రోషన్ లాంటి స్టార్ […]

  • Written By: Neelambaram
  • Published On:
Pooja Hegde: పాపం పూజ హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా తయారు అయ్యింది ఏంటి! ఆమె పని అయిపోయినట్టేనా?

Pooja Hegde: సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే..నాగ చైతన్య హీరో గా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయం లోనే చూస్తుండగానే టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే ఈమె బాలీవుడ్ లో అవకాశాలు సాధించి ఏకంగా హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అంటే మాములు విషయం కాదు..ఇక టాలీవుడ్ లో ఈమె రీ ఎంట్రీ ఒక ప్రభంజనం అనే చెప్పాలి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా లో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే.

Pooja Hegde

Pooja Hegde

Also Read: Pawan Kalyan- Balakrishna: బాలకృష్ణ వద్దనుకున్న సినిమాలు పవన్ కల్యాణ్ చేసినవి ఏంటో తెలుసా?

తన అందచందాలతో కుర్రకారులలో సెగలు పుట్టించి వాళ్ళ మతులు పోగొట్టేలా చేసింది..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన కూడా పూజ హెగ్డే ఈ సినిమాతోనే తన శకం ప్రారంభం అనేలా అందరికి అర్థం అయ్యేలా చేసింది. ఆ సినిమాతో ప్రారంభమైన పూజ హెగ్డే మేనియా ఇటీవల విడుదలైన బీస్ట్ మరియు రాధే శ్యామ్ సినిమాల వరుకు కొనసాగింది..అయితే నిన్న మొన్నటి వరుకు నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా పిలవబడే పూజ హెగ్డే ఇప్పుడు సడన్ గా ఐరన్ లెగ్ గా మారిపోయింది..ఇటీవల కాలం లో ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..ముఖ్యంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి చెప్పుకోవాలి..సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది.

Pooja Hegde

Pooja Hegde

Also Read: Kartikeya 2 Collections: 100 కోట్ల క్లబ్ లో ‘కార్తికేయ 2’.. షేక్ అవుతున్న బాలీవుడ్ స్టార్స్.. ఎన్ని కోట్లు లభామో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇంత పెద్ద ఫ్లాప్ సినిమా మరొకటి లేదు..మరోపక్క తమిళం లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ స్పీడ్ కి బీస్ట్ సినిమా కళ్లెం వేసింది. ఈ సినిమాలో హీరోయిన్ కూడా పూజ హెగ్డేనే..ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడం తో ఈ అమ్మడి వైపు ఇప్పుడు నిర్మాతలు చూడడానికి భయపడుతున్నట్టు తెలుస్తుంది..ప్రస్తుతం ఈమె చేతిలో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమా మినహా మరొక సినిమా లేదు..ఇక కొత్తగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సీత రామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ చుట్టూ మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రదిక్షణలు చేస్తునట్టు సమాచారం..ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెడ్జ్ శకం ముగిసి మృణాల్ ఠాకూర్ శకం ప్రారంభమైనట్టు తెలుస్తుంది..మరి పూజ హెగ్డే భారీ కం బ్యాక్ ఇచ్చి తనని తాను నిరూపించుకుంటుందో లేదో చూడాలి.Read Today's Latest Actress News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు