Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్… సలార్ వాయిదా, కారణం ఇదే!
మరలా చేయాలని సూచించాడట. సలార్ వాయిదా కావడానికి ఇవే ప్రధాన కారణాలు అంటున్నారు. సలార్ డిసెంబర్ కి పోస్ట్ ఫోన్ కావచ్చు. అధికారిక ప్రకటన రానుందని పరిశ్రమలో గట్టిగా వినిపిస్తుంది.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని దెబ్బతగిలింది. మరికొన్ని రోజుల్లో సలార్ విడుదలవుతుందని ఆశపడుతుండగా యూనిట్ నీళ్లు చల్లింది. సలార్ మూవీ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సలార్ వాయిదా వేయడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సలార్ వాయిదా పడుతుందని గతంలో పుకార్లు వినిపించగా యూనిట్ ఖండించారు. చెప్పిన సమయానికి మూవీ విడుదల అవుతుందని అన్నారు.
అయితే సలార్ చిత్ర విడుదల వెనక్కిపోవడం అనివార్యమే అంటున్నారు. సలార్ మూవీలో ఒక ఐటెం సాంగ్ పెట్టాలనేది దర్శకుడు ఆలోచనట. ప్రభాస్ కాలికి సర్జరీ జరిగిన నేపథ్యంలో ఆయన డాన్స్ చేసే పరిస్థితి లేదు. సెప్టెంబర్ 28న విడుదల చేయాల్సి వస్తే ఐటెం సాంగ్ లేకుండా రిలీజ్ చేయాలి. అలాగే సీజీ వర్క్ పట్ల ప్రశాంత్ నీల్ సంతృప్తికరంగా లేరట.
మరలా చేయాలని సూచించాడట. సలార్ వాయిదా కావడానికి ఇవే ప్రధాన కారణాలు అంటున్నారు. సలార్ డిసెంబర్ కి పోస్ట్ ఫోన్ కావచ్చు. అధికారిక ప్రకటన రానుందని పరిశ్రమలో గట్టిగా వినిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. సలార్ మూవీపై ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. ప్రభాస్ గత మూడు చిత్రాలు నిరాశపరిచాయి. రాధే శ్యామ్, ఆదిపురుష్ అయితే దారుణ పరాజయం చూశాయి. వందల కోట్లలో నష్టం వాటిల్లింది. సలార్ తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అందరూ భావిస్తున్నారు.
సలార్ మూవీ కెజిఎఫ్ కథలో భాగమే అనే ప్రచారం జరుగుతుంది. అలాగే సలార్ పార్ట్ 2 కూడా ఉంటుందట. దీనిపై కీలక రోల్ చేస్తున్న జగపతిబాబు క్లారిటీ ఇచ్చాడు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల శృతి హాసన్ డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా అంటూ కథనాలు వెలువడుతున్నాయి.
