Shakeela: అలాంటి పనులు చేయలేక.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేసిన షకీలా..

నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో వచ్చిన అందరు కంటెస్టెంట్ల కంటే కూడా షకీలా.. ఓ అరుదైన కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరొకరితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చిన వాళ్లే.

  • Written By: Vicky
  • Published On:
Shakeela: అలాంటి పనులు చేయలేక.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేసిన షకీలా..

Shakeela: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నిన్న ఊహించని విధంగా షకీలా ఎలిమినేట్ అయ్యింది. వ్యక్తిత్వం పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చిన షకీలా రెండో వారంలోనే ఇంటి నుంచి బయటకు రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కొంతమంది ఈ ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందిస్తున్నారు.

ఎదవ సోది.. ప్రేమ యవ్వరాలు.. అనవసరమైన గొడవలు పడకుండా షకీలా తనలాగా తాను ఉండడం వల్లే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమెను బయటకి పంపించేశారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో వచ్చిన అందరు కంటెస్టెంట్ల కంటే కూడా షకీలా.. ఓ అరుదైన కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరొకరితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చిన వాళ్లే. ఆడియన్స్‌తోనే.. అలానే హౌస్‌లో ఉన్న వాళ్లతోనే ఛీ అనిపించుకున్న వాళ్లే. కానీ వారందరికీ భిన్నం షకీలా. చిన్న చిన్న డిస్కషన్స్ నడిచినా కూడా.. ఆమెతో ఎవరైతే విభేదించారో చివరికి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితి చూశాం. అంతేకాదు ఈ రెండు వారాల్లోనే తెరపైన కనిపించే షకీలా కి తెర వెనుక షకీలా కి చాలా తేడా ఉంది అని ప్రతి ఒక్కరికి అర్థమైంది.

కంటెంట్ కోసం కక్కుర్తి పడకుండా.. తను నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలాగే ఉన్నది తప్ప.. ఎక్కడా లైన్ దాటలేదు షకీలా. కానీ అలాంటి కంటెస్టెంట్ ని రెండో వారంలోనే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ చేసి .. బిగ్ బాస్ అంటే వారిలా వారు ఉండటం కాదు అలానే బిగ్ బాస్ హౌస్ లో మంచితనం పనికిరాదు అని మరోసారి రుజువు చేశారు.

చాలా మంది కంటెస్టెంట్లు బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకొని ఆడారు. కానీ షకీ అమ్మ మాత్రం బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలానే కనిపించారు. కానీ ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ గేమ్ అన్నట్లు వెళ్లిన రెండో వారానికే షకీలాను ఎలిమినేట్ చేసి బైబై చెప్పేశారు.తెలుగు వాళ్లకి దగ్గరవుదామని వచ్చానని.. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అనుకోలేదని ఎలిమినేషన్ సందర్భంగా ఆమె అన్నారు.

కాగా ఈ ఎలిమినేషన్ చూసిన వారందరూ.. షకీలా కు బయట అందరిలాగా పిఆర్ లేకపోవడం వల్ల.. అలానే మిగతా హౌస్ మేట్స్ లాగా తెలివిగా ఆలోచించి ప్రేమా ..సొల్లు.. గొడవలు.. అంటూ షకీలా ప్రవర్తించలేక పోవడం వల్లే ఆమె త్వరగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అని బాధపడుతున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు