NTR: ఎన్టీఆర్ కి ఇల్లీగల్ ఎఫైర్… సంచలనం రేపుతున్న ట్వీట్!
ఎన్టీఆర్ మీద ఉమర్ సంధు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. కేవలం సెన్సేషన్ కోసం ఉమర్ సంధు ఇలాంటి ట్వీట్ చేస్తుంటారు. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి పేరు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2011లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు.

NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఎఫైర్ కలిగి ఉన్నాడంటూ ఫిల్మ్ క్రిటిక్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఈ సోషల్ మీడియా పోస్ట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓవర్సీస్ ఫిలిం క్రిటిక్, సెన్సార్ సభ్యుడైన ఉమర్ సంధు సంచలన పోస్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. హీరో హీరోయిన్స్ మీద తరచుగా ఆరోపణలు చేస్తుంటాడు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎవరినీ వదలదు. ఆ మధ్య ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ లో ఉన్నారని పుకార్లు పుట్టించారు. మాల్దీవ్స్ లో నిశ్చితార్థం అని కూడా ట్వీట్ చేశాడు.
అనంతరం విజయ్ దేవరకొండ-సమంత ఖుషి మూవీ షూట్లో ఒక్కటయ్యారని ట్వీట్ చేశాడు. ఊర్వశి రాతెలాను అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ షూట్లో లైంగిక వేధింపులకు గురి చేశాడని ట్వీట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమర్ సంధు స్టార్స్ మీద గుప్పించిన ఆరోపణలు చాలానే ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశాడు. ఎన్టీఆర్ మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడని ట్వీట్ చేశాడు.
ఎన్టీఆర్ కి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. అతని ఫోన్ భార్య చెక్ చేయగా ఈ విషయం బయటపడింది. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు భార్యలకు తెలియకుండా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారంటూ ట్వీట్ చేశాడు. ఉమర్ సంధు ట్వీట్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉమర్ సంధుని ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. ఉమర్ సంధు అందరిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నా అతనిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఊర్వశి రాతెలా అయితే పరువు నష్టం దావా వేస్తానంటూ సోషల్ మీడియా ప్రకటన చేసింది.
ఎన్టీఆర్ మీద ఉమర్ సంధు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. కేవలం సెన్సేషన్ కోసం ఉమర్ సంధు ఇలాంటి ట్వీట్ చేస్తుంటారు. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి పేరు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2011లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు.
Breaking news: #JrNTR wife recently caught him with another woman. He is having extra marital affair. His wife checked his phone & she got to know about her. Every actor in Tollywood is having secret affairs now a days. pic.twitter.com/x2FNzwyBFD
— Umair Sandhu (@UmairSandu) June 1, 2023
