Bigg Boss 7 Telugu: ఉల్టా పల్టా ఓటింగ్… టాప్ కంటెస్టెంట్స్ పై ఎలిమినేషన్ కత్తి… సీరియల్ బ్యాచ్ నుండి ఒకరు అవుట్?
ప్రిన్స్ యావర్ టాస్క్ పరంగా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు. హౌస్ లో అందరితో మంచిగా ఉంటూ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. దాంతో నామినేషన్స్ లో కి వచ్చిన ప్రతిసారి టాప్ ఓటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు యావర్.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఎప్పటిలానే ఈ వారం కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి.కాగా ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు ప్రిన్స్ యావర్,భోలే షావలి,రతిక రోజ్,శోభా శెట్టి,ప్రియాంక జైన్,అమర్ దీప్,తేజ,అర్జున్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అయితే తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి ప్రారంభం అయింది.
కాగా ప్రిన్స్ యావర్ టాస్క్ పరంగా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు. హౌస్ లో అందరితో మంచిగా ఉంటూ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. దాంతో నామినేషన్స్ లో కి వచ్చిన ప్రతిసారి టాప్ ఓటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు యావర్. అతనొక్కిడికే 20 శాతం వరకు ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి రెండు స్థానాల్లో స్థిరంగా ఉన్నారు.
ఇక మిగిలిన స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.కాగా మూడో స్థానంలో భోలే కొనసాగుతున్నాడు. నాలుగవ స్థానంలో రతిక రోజ్ ఉంది. ఇక ఐదవ స్థానంలో అంబటి అర్జున్ ఉన్నాడు.ఈ వారం టేస్టీ తేజ ఆరో స్థానానికి పడిపోయాడు. ఇక టాప్ కంటెస్టెంట్స్ అయిన ప్రియాంక జైన్,శోభా శెట్టి డేంజర్ జోన్ ఉన్నారు. ప్రియాంక ఏడో ప్లేస్ లో ఉంది. తనను తాను స్ట్రాంగ్ అని చెప్పుకుంటూ తిరిగే శోభా శెట్టి అందరికంటే లీస్ట్ ఓటింగ్ తో చివరి స్థానానికి పడిపోయింది.
అందరికంటే తక్కువ ఓటింగ్ వస్తుందనుకున్న భోలే కి ఊహించని విధంగా ఓటింగ్ నమోదవుతుంది. మేము తోపు,మేము స్ట్రాంగ్ అనుకుంటున్నా శోభా,ప్రియాంకలు దారుణంగా చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. శోభా శెట్టి కి ఓట్లతో సంబంధం లేకుండా డేంజర్ లో ఉన్నా సరే సేఫ్ అయిపోతుంది.ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసేలోపు ఎన్ని మార్పులైనా జరగవచ్చు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.
