Ugadi 2023: ఉగాది తెలుగు పండగ: ఈరోజు ఏం చేయాలంటే..

Ugadi 2023: సృష్టికర్త అయిన బ్రహ్మ… చైత్రశుద్థ పాడ్యమి నాటి ఉషోదయ సమయాన జగత్తును సృష్టించాడు. దీనిని ‘బ్రహ్మాండ పురాణం’ పేర్కొంటోంది. ఆ ప్రకారం… సృష్టి ఏర్పడిన తొలి సంవత్సరానికి ర‘పభవ’ అనే పేరు పెట్టారు. అదే ఉగ+ఆది= ఉగాది. తెలుగువారికి ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ‘సంవత్సరాది’గానూ దీన్ని వ్యవహరిస్తారు. సాధారణంగా చాలా మంది కొత్త పనులను ఈ పండగ నాడే ప్రారంభిస్తారు. రైతులు ఎద్దులతో అరక కడతారు. ఈరోజున అరక కడితే సంవత్సరం మొత్తం […]

Ugadi 2023: ఉగాది తెలుగు పండగ: ఈరోజు ఏం చేయాలంటే..

Ugadi 2023: సృష్టికర్త అయిన బ్రహ్మ… చైత్రశుద్థ పాడ్యమి నాటి ఉషోదయ సమయాన జగత్తును సృష్టించాడు. దీనిని ‘బ్రహ్మాండ పురాణం’ పేర్కొంటోంది. ఆ ప్రకారం… సృష్టి ఏర్పడిన తొలి సంవత్సరానికి ర‘పభవ’ అనే పేరు పెట్టారు. అదే ఉగ+ఆది= ఉగాది. తెలుగువారికి ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ‘సంవత్సరాది’గానూ దీన్ని వ్యవహరిస్తారు. సాధారణంగా చాలా మంది కొత్త పనులను ఈ పండగ నాడే ప్రారంభిస్తారు. రైతులు ఎద్దులతో అరక కడతారు. ఈరోజున అరక కడితే సంవత్సరం మొత్తం మంచి పంటలు పండతాయని నమ్మిక.

రాబోతున్నది శోభకృత్‌

మన కాలమాణం చాంద్రమానం ప్రకారం ఉంటుంది. కాలచక్రం ప్రభవ నుంచి క్షయ వరకూ… అరవై సంవత్సరాలు పరిభ్రమిస్తుంది. తిరిగి ప్రభవకు వస్తుంది. ఈ పరిభ్రమణంలో… కొత్తగా రాబోతున్నది ‘శోభకృత్‌’ నామ సంవత్సరం. చాంద్రమానాన్ని అనుసరించి సంవత్సరంలో ఆరు రుతువులు. ప్రతి రుతువులోనూ ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శిశిర రుతువులో ఆకులు రాల్చిన చెట్లు… చైత్ర మాసంలో చిగుళ్ళు తొడిగి, చైతన్యవంతమవుతాయి. పూలతో, పండ్లతో కళకళలాడుతాయి.

ప్రకృతి వైభవం

ఈ ప్రకృతి వైభవం అంతా వసంత రుతువు తొలిరోజైన ఉగాది పర్వదినంలో కనిపిస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన సంవత్సరాది నాడు అనుసరించవలసిన విధి విధానాలు పురాణాలు మనకు అందించాయి. అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, గృహాలంకరణ, ఉగాది పచ్చడి తయారు చేసి, దేవునికి నివేదించడం, పెద్దలకు నమస్కరించి, వారితో పాటు ఉగాది పచ్చడి స్వీకరించడం, దేవాలయ దర్శనం, పంచాంగాన్ని పూజించి, అందరితో కలిసి పఠించడం లేదా వినడం ఈ క్రతువులో ముఖ్యమైనవి.

Ugadi 2023

Ugadi 2023

పండుగ నాడు చేయాల్సింది ఇదీ

ఉదయం ఒంటికి నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయడం వల్ల లక్ష్మీ కృపకు పాత్రులవుతారు. ముందురోజే పుజామందిరాన్ని అలంకరించి, గుమ్మాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, గుమ్మాలకు మామిడి ఆకులు కట్టి, ముంగిట ముగ్గులు పెట్టి… వసంతలక్ష్మిని ఆహ్వానించాలి. ఆరోగ్యప్రదాయినిగా ఆయుర్వదం పేర్కొంటున్న ఉగాది పచ్చడి స్వీకరించాక చేసే పంచాంగ శ్రవణం.

రాబోయే కాలంలో..

‘తిథి, వారం, నక్షత్రం, కరణ, యోగా’లనే అయిదు అంగాలతో కూడినది పంచాంగం. రాబోయే సంవత్సర కాలంలో గ్రహాల సంచారం, అవి కలిగించే ఫలితాలు దీనిద్వారా తెలుస్తాయి. అననుకూలతలు ఏవైనా ఉంటే… భగవంతుణ్ణి ఆశ్రయించి వాటిని నివారించుకోవడం దీని వెనుక ముఖ్యమైన ఉద్దేశం. నూతన వత్సరమైన ‘శోభకృత్‌’ పేరులోనే శుభ, శోభ, వైభవ, ప్రాభవ, కళా కాంతులు ఉన్నాయి. శుభసంకల్పాలు చేసుకొని వాటిని ఆచరిస్తే ఈ ఏడాది జీవితాల్లో సర్వం శోభాయమానంగా ఉంటుందనేది నమ్మిక.

Tags

    follow us