Uttar Pradesh: వదిన, మరదలు.. ప్రేమ.. పెళ్లి.. ఇదెక్కడి చోద్యం రా బాబూ!
ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే అయినా.. చాలా శక్తివంతమైనది. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేము. ఇలా ఎందరో ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.

Uttar Pradesh: ‘మేము ప్రేమించుకున్నాం.. మా ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఏడు నెలల క్రితం ఇంట్లోల నుంచి పారిపోయాం.. పెళ్లి కూడా చేసుకున్నాం.. మీరే మాకు రక్షణ కల్పించండి’ అని ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా పెద్దలు అంగీకరించని అన్ని ప్రేమ కథల్లో ఉండేదే కదా కొత్తదనం ఏముంది అనుకుంటున్నారు. ఉంది. పోలీసులను ఆశ్రయించిన జంటలో ఇద్దరూ మహిళలే. వరుసకు వదిన, మరదలు. అదే అసలు ట్విస్ట్.
ప్రేమ పుట్టిందిలా..
ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే అయినా.. చాలా శక్తివంతమైనది. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేము. ఇలా ఎందరో ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. అయితే కొందరి ప్రేమలను చూస్తే చాలా వింతగా ఉంటుంది. వరుసకు అన్న చెల్లెల్లు అయ్యేవారు ప్రేమించుకున్నారు. మామ, కోడలు ప్రేమించుకున్నారు. ఇలాంటి ప్రేమలే అందరిని షాక్ కి గురిచేస్తుంటే.. వరసకు వదిన, మరదలు అయ్యే ఇద్దరు యువతుల మధ్య ప్రేమ పుట్టింది. అది ఇద్దరినీ ఇంట్లోల నుంచి పారిపోయేలా చేసింది. తర్వాత పెళ్లి వరకూ తీసుకెళ్లింది. చివరకు రక్షణ కోసం వచ్చి పోలీసులకు షాక్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
స్నేహం నుంచి ప్రేమ వరకు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలోని బహేజోయ్ అనే గ్రామంలో ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆ యువతికి వరసకు మరదలు అయ్యే మరో యువతితో స్నేహం ఏర్పడింది. చిన్నతనం నుంచే స్నేహంగా ఉండే వారు. అయితే పెరిగిన తరువాత వారి స్నేహం ధృఢంగా మారింది. ఈ క్రమంలో సదరు యువతి తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలో పని చేస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఇంట్లో వారికి తెలియడంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
యువతుల కోసం గాలింపు..
యువతులు పారిపోయి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిన తల్లిదండ్రులు వారి కోసం తీవ్రంగా గాలించారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు, నోయిడా ప్రాంతాల్లో తీవ్రంగా గాలించిన యువతుల ఆచూకీ లభించలేదు. ఏడు నెలల తర్వాత తిరిగి బహేజోయ్ పోలీస్ స్టేషన్ ఇద్దరు యువతులు ప్రత్యేక్షమయ్యారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ యువతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు పెద్దలను పిలిపించి వారికి కూడా కౌన్సెలింగ్ చేశారు. తర్వాత ఎవరింటికి వారిని పంపించారు.
మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ వదిన, మరదలు విడిపోయి జీవించగలుగుతారా.. లేక మళ్లీ ఇళ్ల నుంచి పారిపోతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారి ఎడబాటు చూడలేక చివరకు పెద్దలే కలిపేస్తారా అనేది చూడాలి.
