Rajasthan: వైరల్ వీడియో: వీళ్లు పోలీసులా? పాపం ఆ మహిళ ఎంత విలవిలలాడిపోయిందో?

Rajasthan: పోలీసులంటే మన సమాజం ఎందుకు భయపడుతుందో తెలుసా? వాళ్లు రక్షక బటులు కాబట్టి. ఎవరైనా తప్పు చేస్తే దండించే అధికారం వారికి ఉంది కాబట్టి. అన్నింటికీ మించి శాంతి భద్రతల పరిరక్షణలో వారు అసలు రాజీపడరు కాబట్టి. కనిపించే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి వారు ప్రతీకలు కాబట్టి.. సమాజం వారిని గౌరవిస్తుంది. అంతకుమించి భయపడుతుంది. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్న పోలీసులను మనం చూసాం. వారి […]

  • Written By: Bhaskar
  • Published On:
Rajasthan: వైరల్ వీడియో: వీళ్లు పోలీసులా? పాపం ఆ మహిళ ఎంత విలవిలలాడిపోయిందో?

Rajasthan: పోలీసులంటే మన సమాజం ఎందుకు భయపడుతుందో తెలుసా? వాళ్లు రక్షక బటులు కాబట్టి. ఎవరైనా తప్పు చేస్తే దండించే అధికారం వారికి ఉంది కాబట్టి. అన్నింటికీ మించి శాంతి భద్రతల పరిరక్షణలో వారు అసలు రాజీపడరు కాబట్టి. కనిపించే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి వారు ప్రతీకలు కాబట్టి.. సమాజం వారిని గౌరవిస్తుంది. అంతకుమించి భయపడుతుంది. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్న పోలీసులను మనం చూసాం. వారి పేరు మీద సినిమాలు నిర్మితమైతే సంబరపడ్డాం. కానీ కొందరు పోలీసులు వారి ప్రవర్తన తీరుతో ఆ శాఖకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆ శాఖ అంటేనే ప్రజల్లో ఏవగింపుభావన కలుగుతుంది.. అలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.

అంతకంటే దారుణం

సాధారణంగా పోకిరీలు, రౌడీలు యువతులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన పోలీసులు.. ఆ కోవలోకే వెళ్లారు. వారికి, రౌడీలకు పెద్ద తేడా లేదని నిరూపించుకున్నారు. ఫలితంగా రాజస్థాన్ పోలీస్ శాఖకు చెడ్డ పేరు వచ్చింది. ఆ పోలీసులు చేసిన నిర్వాకం తాలుకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.. అయితే ఈ వీడియోలో పోలీసులు మాత్రమే కాకుండా ఒక న్యాయవాది ఉండడం విశేషం. పైగా వీరు చేసిన నిర్వాకాన్ని వీడియో తీయడం కలవరానికి గురిచేస్తోంది. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ ప్రాంతంలోని లసాడియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో సురేంద్ర సింగ్ అనే కానిస్టేబుల్, గోగుండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న లోకేష్ కుమార్ అనే కానిస్టేబుల్ ను ఉదయపూర్ ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇంతకీ వీరు చేసిన నేరం ఏమిటంటే..

ఓ గదిలో మహిళతో..

పైన పేర్కొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు, న్యాయవాది ఒక మహిళతో అత్యంత దారుణంగా ప్రవర్తించడమే ఈ సంఘటనకు కారణం. వాస్తవానికి ఆ మహిళ ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అయితే ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని లాయర్ మాటల్లో పెట్టాడు. ఆమెను ఒక గదికి తీసుకెళ్లాడు. అందులో పడుకొని ఉన్న లాయర్..తన తలను మహిళ ఒడిలో పెట్టుకొని ఉన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో లాయర్ రాసలీలలు కొనసాగించాడు. పక్కనే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ వ్యవహారాన్ని మొత్తం తమ ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించారు. పైగా వారు అక్కడే ఫుల్లుగా మద్యం తాగారు. ఈ ఘటనను అడ్డుకోకుండా ఆ న్యాయవాదికి వత్తాసు పలికేలా వారు వ్యవహరించారు. పైగా ఆ మహిళను కేసు బూచి తో భయపెట్టారు. దీంతో ఆమె గత్యంతరం లేక న్యాయవాది చెప్పినట్టు చేసింది. కానిస్టేబుళ్ళు తీసిన ఈ వీడియో ఆ నోటా ఈ నోటా పడి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు ఆ కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. సురేంద్ర గతంలో భూపాల్ పుర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలోను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడి పై ఒక బాలిక నేరుగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని 2022 డిసెంబర్లో లసాడియా పోలీస్ స్టేషన్ కి బదిలీ చేసి, కేసు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఐదు రోజుల క్రితం గోగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు మృతి పై అక్కడి ఎస్ఐ, ఆరుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన మరవకముందే మళ్లీ ఇద్దరు కానిస్టేబుళ్ళు సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు