Allu Arjun: అల్లు అర్జున్ వెనుక ఇద్దరు బడా దర్శకులు.. ఒకరి తెలుగు, మరొకరి తమిళ్..

ప్రస్తుతం‌ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ పుష్ప సీక్వెల్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

  • Written By: Vishnupriya
  • Published On:
Allu Arjun: అల్లు అర్జున్ వెనుక ఇద్దరు బడా దర్శకులు.. ఒకరి తెలుగు, మరొకరి తమిళ్..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ సాధించి.. దేశం దృష్టిని మొత్తం తన వైపు మళ్లించుకున్నారు.‌ పుష్ప సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో నేషనల్ అవార్డుతో పేరు.. ప్రఖ్యాత రెండు తెచ్చుకున్నారు.

ఇక ప్రస్తుతం‌ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ పుష్ప సీక్వెల్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పుష్ప2‌ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. పుష్ప తరువాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తర్వాత ఇద్దరు బడా దర్శకులు అల్లు అర్జున్‌ తో సినిమా చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఇందులో ఒకరు తెలుగు అగ్ర దర్శకుడు కాగా మరొకరు తమిళ అగ్ర దర్శకుడు అని తెలుస్తోంది.‌ అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్‌ కి కథ చెప్పి, ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని బోయపాటి, అట్లీ ఇద్దరూ గట్టిగా ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.‌ ప్రస్తుతం అట్లీ జవాన్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా.. బోయపాటి స్కందా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మరోపక్క అల్లు అర్జున్ సందీప్ రెడ్డి తోనే కాదు త్రివిక్రమ్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ డైరెక్టర్ల కథ విని మన బన్నీ మనసు మార్చుకొని.. ముందుగా వీళ్ళిద్దరికీ ఏమన్నా డేట్స్ ఇస్తారేమో చూడాలి.

ఇక పుష్ప2 విషయానికి వస్తే.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు