Amber Heard- Elon Musk: ట్విట్టర్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న తరువాత అన్నీ సంచలనాలే. ముందుగా ఆయన కంపెనీలో అడుగుపెట్టిన తరువాత తనకు నచ్చని వారందరికీ ఉద్వాసన పలికారు. ఆ తరువాత ట్విట్టర్ వెరిఫికేషన్ కోసం బ్లూ టిక్ కావాలంటే డబ్బులు చెల్లించాలని నిబంధన పెట్టాడు. దీంతో ఇన్ని నిబంధనలు తట్టుకొని ఇందులో ఉండడమెందుకని చాలా మంది సెలబ్రెటీలు ట్విట్టర్ ను వీడుతున్నారు. లేటెస్టుగా స్టార్ హీరోయిన్ ట్విట్టర్ ఖాతా కనిపించడం లేదు. ఆమె ఖాతా కనిపించడం లేదని ఓ వ్యక్తి యూట్యూబ్ లో పెట్టాడు. అసలు విషయమేంటంటే ఆమె ఎవరో కాదు.. ఎలన్ మస్క్ మాజీ ప్రేయసి. దీంతో ఆమె ఖాతాను ఆమె డెలీట్ చేసుకుందా..? లేక ఎలన్ మస్క్ తీసేశాడా..? అనేది హాట్ టాపిక్.

Amber Heard- Elon Musk
హాలీవుడ్ అంబర్ హార్డ్ గురించి తెలియని వారుండరు. ఈమె ఇటీవల సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ ’ హీరో జానీ డెప్ కు ఒకప్పటి భార్య. ఆ తరువాత వీరు విడిపోయారు. అయితే అంబర్ హార్డ్ పై పరువు నష్టం దావా వేయడంలో జానీడెప్ కు 10.35 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అసలు ఆమెపై పరువు నష్టం దావా వేయడానికి ఓ కారణం ఉంది. అపర కుభేరుడు ఎలన్ మస్క్ తో అంబర్ హార్ట్ లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగింది. జానీ డెప్ తో విడాకుల తర్వాత వీరి సంబంధం కొనసాగినా.. తనను మోసం చేసిందని జానీ డెప్ ఆమెపై పరువు నష్టం దావా వేసి గెలిచాడు.
ఇక అసలు విషయానికొస్తే అంబర్ హార్డ్, ఎలన్ మస్క్ 2016 నుంచి 2018 వరకు కలిసున్నారు. ఆ తరువాత పలు కారణాలతో విడిపోయారు. కొన్ని రోజుల కిందట ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన అడుగుపెట్టిన తరువాత తనకు నచ్చని వారందరినీ తీసేశాడు. టెస్లా ఉద్యోగులను ఇందులో చేర్చుకున్నాడు. ఆ తరువాత మైక్రో బ్లాగింగ్ ద్వారా స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తానని ఎలన్ మస్క్ ప్రకటించారు. కానీ ఆ తరువాత కఠిన నిబంధనలు పెట్టారు. వాటిలో బ్లూ టిక్ కోసం నెలకు రూ.8 డాలర్లు చెల్లించాల్సిందిగా తెలిపారు.

Amber Heard- Elon Musk
ఈ నిర్ణయాన్ని ఇప్పటికే చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పటికే కొందరు సెలబ్రెటీలు ట్విట్టర్ ను వీడారు. టోని బ్రాక్స్ టన్, షోండా రిమెస్, వ్రెస్లర్ మిక్ పోలేయ్ తో పాటు తదితరులు ట్విట్టర్ ను వీడిన వారిలో ఉన్నారు. తాజాగా అంబర్ హార్ట్ ఖాతా కూడా కనిపించడం లేదు. మాథ్యూ లెవిస్ అనే ఓ యూట్యూబర్ దీనిని గుర్తించి స్క్రీన్ షాట్ తీశాడు. దానిని ‘ది అంబ్రెల్లా గాయ్’ అనే యూట్యూబ్ ఛానెల్ లో పెట్టి ‘అంబర్ హార్డ్ తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసింది’ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి. కొందరు ఎలన్ మస్క్ తనకు నచ్చని కారణంగా అంబర్ హార్డ్ ఖాతాను డిలీట్ చేశారని అంటున్నారు.. మరికొందరు ఆమెనే ట్విట్టర్ నుంచి వెళ్ళిపోయింది అని మెసేజ్ లు పెడుతున్నారు. అయితే ఎవరూ దీనిపై స్పందించలేదు. చివరికి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.