Varun Tej Lavanya Tripathi Marriage: లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ మ్యారేజ్ లో ట్విస్ట్… అంతా ఆమె చేతుల్లోనే ఉందట!
ఇటలీ దేశంలో ఈ నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై వరుణ్ తేజ్ నేరుగా క్లారిటీ ఇచ్చారు. ఇంకా పెళ్ళికి ముహూర్తం కుదరలేదని స్పష్టత ఇచ్చారు.

Varun Tej Lavanya Tripathi Marriage: హీరో వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఆయనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ ఏడాది జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఘనంగా నిశ్చితార్థం నిర్వహించారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం దక్కలేదు. ఇక ఆగస్టులోనే వీరి వివాహం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇటలీ దేశంలో ఈ నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై వరుణ్ తేజ్ నేరుగా క్లారిటీ ఇచ్చారు. ఇంకా పెళ్ళికి ముహూర్తం కుదరలేదని స్పష్టత ఇచ్చారు. అలాగే పెళ్లి ఎప్పుడని నిర్ణయించాల్సిందే అమ్మే అని చెప్పుకొచ్చారు. నవంబర్ లేదా డిసెంబర్ లో పెళ్లి తేదీ ఉండవచ్చు. ఎప్పుడనేది మాత్రం అమ్మ డిసైడ్ చేస్తుందని వరుణ్ అన్నారు.
అనుకున్నట్లే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు కూడా కారణం ఉందట. పెళ్లి ప్రైవేట్ గా జరిగితేనే బాగుంటుందని వరుణ్ అభిప్రాయం అట. అందుకు ఇండియాలో ఓ మూడు ప్లేసెస్, విదేశాల్లో మరో రెండు ప్లేసెస్ పరిశీలిస్తున్నారట. వరుణ్ మాటలను బట్టి చూస్తే ఈ ఏడాది చివర్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇక లావణ్యతో ప్రేమ వ్యవహారం గురించి కూడా అతడు ఓపెన్ అయ్యాడు.
ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే లావణ్య నే అన్నాడు. లావణ్య త్రిపాఠి లవ్ ప్రపోజల్ పెట్టగా నేను ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. లావణ్య-వరుణ్ తేజ్ జంటగా మొదటిసారి మిస్టర్ మూవీకి పని చేశారు. అప్పుడే ఈ ప్రేమ మొదలైందని సమాచారం. చాలా కాలం వీరి రిలేషన్ రహస్యంగా ఉంది. ఓ రెండేళ్లుగా మాత్రం పుకార్లు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఈ విషయాన్ని ఖండించిన లావణ్య సడన్ గా వరుణ్ తో పెళ్ళికి సిద్ధమైంది.
