TV9 Vs NTV: నెంబర్ వన్ స్థానం కోసం కుట్రలు: బజారునపడ్డ టీవీ9, ఎన్టీవీ

వాస్తవానికి చాలా వారాల కిందటే ఏపీలో టివి9 రెండవ స్థానంలోకి వెళ్లిపోయింది. ఎన్టీవీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. తర్వాత చాలా వారాల అనంతరం టీవీ ఒక్క పాయింట్ తేడాతో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది.

TV9 Vs NTV: నెంబర్ వన్ స్థానం కోసం కుట్రలు: బజారునపడ్డ టీవీ9, ఎన్టీవీ

TV9- NTV: “వార్త యందు జగతి వర్ధిల్లుతున్నది” బూదరాజు రాధాకృష్ణ హయాంలో తెరపైకి వచ్చిన సామెత. ఇప్పుడు ఈ సామెతను మార్చి రాసుకోవాలేమో. ఎందుకంటే మీడియాలోకి వ్యాపారవేత్తలు రావడంతో ఇది కూడా ఒక పోటీ అయిపోయింది. అందులోనూ నెంబర్వన్ స్థానం కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభమైంది. అంతేకాదు పనితీరు వల్ల జనాల్లోకి వెళ్లాల్సింది పోయి రాజకీయ నాయకుల మాదిరి విమర్శలు చేసుకుంటూ డబ్బా కొట్టుకోవడం విస్మయ్యాన్ని కలిగిస్తోంది. మనం గతంలోనే చెప్పుకున్నాం కదా టీవీ9 తో పోలిస్తే ఎన్ టివి నెట్వర్క్ చాలా తక్కువని.. అయినప్పటికీ తన ప్లెయిన్ కవరేజ్తో ఎన్టీవీ మొదటి ర్యాంకు కొట్టేసింది. సహజంగానే ఇది టీవీ9 కు నచ్చలేదు.. ఎన్టీవీ నెంబర్ వన్ ఛానల్ కాబట్టి.. ఎలాగూ టీవీ9 ఆ ప్రచారం చేసుకోలేదు. కాబట్టి నెంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ అంటూ అప్పట్లో డబ్బాలు కొట్టుకుంది. కానీ ఎప్పుడైతే టీవీ9 తిరిగి మొదటి ర్యాంకులోకి వచ్చిందో అప్పుడు దాని కళ్ళు నెత్తికెక్కాయి. దానిని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు ఎప్పుడైతే నెంబర్ వన్ ర్యాంకు వచ్చిందో అప్పుడు తన ఆఫీసులో సంబరాలు చేసుకుంది. ఆ రుధిరం దేవి లోగో పట్టుకొని రజినీకాంత్, మురళీకృష్ణ, ఇంకా టీవీ9 కి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసింది. అంతేకాదు టీవీ9 నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకునేందుకు పడిన కష్టాల్ని కథలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఈ దరిద్రం ముగిసింది అనుకునే లోగానే టీవీ9 మళ్లీ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది.

వాస్తవానికి చాలా వారాల కిందటే ఏపీలో టివి9 రెండవ స్థానంలోకి వెళ్లిపోయింది. ఎన్టీవీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. తర్వాత చాలా వారాల అనంతరం టీవీ ఒక్క పాయింట్ తేడాతో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీవీ9 కొత్తగా రోడ్లపై ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. పెద్దపెద్ద నగరంలోని డివైడర్ల మధ్య హోర్డింగ్స్ పెట్టింది. తమ నెంబర్ వన్ స్థానానికి ఎలా వచ్చామో చెబుతూనే.మ పుట్ట ద్వారా నెంబర్ వన్ వచ్చిందన్న అర్థంలో పెట్టుకొని, అది ఎక్కువ కాలం ఉండదని చెప్పుకొచ్చింది. పోటీ ఛానల్ పేరు ప్రస్తావించకపోవడంతో ఆ కుట్ర ద్వారా నెంబర్ వన్ స్థానానికి వచ్చినట్టు టీవీ9 తనకు తానే చెప్పుకుంటుంది. అయితే టీవీ9 చెప్పిన దాని ప్రకారం నెంబర్ వన్ స్థానం ఎక్కువకాలం నిలబడదని చెబుతున్నట్టు ఉందన్న అభిప్రాయం వెలిగించడం మొదలుపెట్టింది. అది కాదని టీవీ9 నే ఎన్ టీవీని మాక్ చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కారణాలు ఏమైనప్పటికీ నెంబర్ వన్ ర్యాంక్ కోసం టీవీ9, ఎన్ టివి పోటాపోటీగా పోరాడాయి. మొదట్లో నెంబర్ వన్ ర్యాంకులో టీవీ9 కొనసాగింది. తర్వాత ఆ స్థానాన్ని ఎన్ టివి ఆక్రమించింది. తర్వాత కొద్ది కాలానికి టీవీ9 మొదటి స్థానాన్ని తిరిగి సంపాదించింది. ఇప్పుడు ఈ నెంబర్ వన్ స్థానం రెండు ఛానల్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి కల్పించింది. అంతేకాదు రెండు చానల్స్ బజారులోకి వచ్చి వాతావరణం కల్పించింది. ఏ మాటకు ఆ మాట ఈ రెండు చానల్స్ ప్రజాప్రయోజనాలను గాలికి వదిలేసాయి. తమ యజమానులు, వారికి చేసే సహాయ సహకారాలతో అధికార పార్టీలకు బాకాలు ఊదుతున్నాయి. ఇక ప్రజల కోసం పోరాటాలు చేసే విపక్ష నేతలపై బురద చల్లడం ప్రారంభించి చాలా కాలమైంది. అందుకే ఈ రెండు చానల్స్ ను రాజకీయ పార్టీలు బ్యాన్ చేశాయి. ఇక విచిత్ర వార్తల విషయంలో రెండు చానల్స్ ఒకదానితో మరొకటి పోటీ పడతాయి. అయితే నెంబర్ వన్ ర్యాంక్ విషయంలో ఈ రెండు చానల్స్ ప్రస్తుతానికి రోడ్డున పడ్డాయి. మును ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇప్పట్లో ఈ వార్తకే సూచనలు కనిపించడం లేదని మీడియా మిత్రులు చెబుతున్నారు. ఇప్పటికైతే పరిస్థితి న గురుగప్పిన నిప్పులా ఉందనేది వాస్తవం. మరి దీన్ని ఈ రెండు చానల్స్ ఎలా అధిగమిస్తాయి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు