యస్‌ బ్యాంకులో ముందే టిటిడి రూ 1300 ఉపసంహరణ

యస్‌ బ్యాంకు షేర్లు 85 శాతం ప‌డిపోయాయి. యస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించ‌డం వ‌ల్ల ఆ బ్యాంకు ట్రేడింగ్‌లో బోరుమ‌న్న‌ది. కేవ‌లం 50 వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవాల‌ని ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. దానితో ఆ బ్యాంకు ఖాతాదారులు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన్నట్లున్నారు. న్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్ల ఉపంసహరణ టీడీపీ […]

  • Written By: Neelambaram
  • Published On:
యస్‌ బ్యాంకులో ముందే టిటిడి రూ 1300 ఉపసంహరణ

యస్‌ బ్యాంకు షేర్లు 85 శాతం ప‌డిపోయాయి. యస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించ‌డం వ‌ల్ల ఆ బ్యాంకు ట్రేడింగ్‌లో బోరుమ‌న్న‌ది. కేవ‌లం 50 వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవాల‌ని ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. దానితో ఆ బ్యాంకు ఖాతాదారులు అందరూ ఆందోళన చెందుతున్నారు.

కానీ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన్నట్లున్నారు. న్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్ల ఉపంసహరణ

టీడీపీ హయాంలో ఎస్‌ బ్యాంకు సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లోకి టీటీడీ డిపాజిట్లు వేశారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌ కాగానే… డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి సారించారు.

ఆ నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న టీటీడీ ఛైర్మన్‌ యస్‌ బ్యాంకు పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసారు. వెంటనే ఆ బ్యాంకు లోని డిపాజిట్లను వెనుకకు తీసుకోవాలని ఆదేశాలలు జారీ చేశారు.

ఈ డిపాజిట్ లను ఆ బ్యాంకు నుండి ఉపసంహరించుకోవద్దని ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చే, మరెవ్వరు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా చేయగలిగారు.

చివరకు యస్‌ బ్యాంకు నుంచి 1300 కోట్లు టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించడంతో ఇప్పుడు టిటిడి అధికారులు ఊపీరి పీల్చుకొంటున్నారు.

సంబంధిత వార్తలు