TS RTC Online Services: తెలంగాణ ప్రగతి రథం ఆర్టీసీ.. ఇప్పటికే వివిధ కారణాలతో సంస్థ నష్టాల బాటలో ప్రయాణం సాగిస్తోంది. ఈ సంస్థకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. మరోవైపు సంస్థను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో సంస్థను లాభాల బాట పట్టించే బాధ్యతను ఎండీ సజన్నార్ భుజానికెత్తుకున్నారు. దొడ్డిదారిన కొన్ని.. నేరుగా కొన్ని చార్జీలు పెంచి కొంత మేర ఆర్థికంగా సంస్థను ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరు విద్యార్థుల బస్‌పాస్ చార్జీలను కూడా భారీగా పెంచేశారు. కానీ పెంచిన చార్జీలు, వసూలు చేస్తున్న సేవా పన్నులకు అనుగుణంగా సేవలు మాత్రం అందించడం లేదు. దీంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు.

sajjanar
సతాయిస్తున్న సర్వర్..
తాజాగా ఆర్టీసీ ఆన్‌లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పది రోజులుగా సరైన సేవలు అందడం లేదు. ఫలితంగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు, ఇటీవలే ప్రభుత్వం జర్నలిస్టులకు జారీ చేసిన నూతన అక్రిడిటేషన్ ఆధారంగా బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్
ఆన్‌లైన్ కేంద్రాల్లో గంటల తరబడి నిరీక్షణ..
ఆగస్టు మొదటి వారంలో విద్యార్థులు నూతన బస్ పాస్‌లు, ఇప్పటికే పాస్ తీసుకున్నవారు రెన్యూవల్ కోసం ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్తున్నారు.
టీఎస్‌ఆర్టీసీ సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడం గంటల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో కళాశాల, పాఠశాల విద్యార్థులు తరగతులు నష్టపోతున్నారు. ఇప్పటికే పాస్ గడువు ముగిసిన విద్యార్థులు చార్జీలు పెట్టుకుని బస్సుల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

TS RTC Online Services
బుకింగ్‌కు అంతరాయం..
ఆర్టీసీ సర్వర్‌లో లోపం కారణంగా సంస్థ టికెట్ బుకింగ్‌లు కూడా బాగా తగ్గిపోయాయి. దూర ప్రాంత ప్రయాణికులు ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు. కాని వారం పది రోజులుగా సర్వర్ సమస్యతో టికెట్ బుకింగ్‌లు కావడం లేదు. దీంతో ప్రయాణికులు సంస్థ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధిలేక ప్రైవేటు వాహనాలు బుక్‌చేసుకుటున్నారు. ఇప్పటికే అంతంత మాత్రం ఆదాయంతో ఉన్న సంస్థపై సర్వర్ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోంది.
స్పందించని యాజమాన్యం..
సర్వర్ సతాయింపుపై ఆర్టీసీ యాజమాన్యం కనీసం స్పందించడం లేదు. సర్వర్ అంతరాయానికి కారణాలను కూడా తెలుపడం లేదు. దీంతో ఆన్‌లైన్ కేంద్రాల నిర్వాహకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీసీ సేవల కోసం కేంద్రాలకు వచ్చేవారిని తిప్పి పంపుతున్నారు. దీనినే పట్టుకుని కూర్చుంటే ఇతర పనులకు అంతరాయం కలుగుతోందని పేర్కొంటున్నారు.
Also Read:Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ల భారీ స్కెచ్.. వైసీపీతో మైండ్ గేమ్