TS High Court : దరఖాస్తుల్లో ఇక నో క్యాస్ట్‌.. నో రిలీజియన్‌.. సంచలన తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు!

విద్యతోపాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది. 

  • Written By: Raj Shekar
  • Published On:
TS High Court : దరఖాస్తుల్లో ఇక నో క్యాస్ట్‌.. నో రిలీజియన్‌.. సంచలన తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు!
TS High Court : విద్యతోపాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది.
కొడుకు సర్టిఫికెట్‌ కోసం.. 
తమ కుమారుడికి నో క్యాస్ట్‌.. నో రిలీజియన్ సర్టిఫికెట్‌ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప పలుమార్లు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్వరూపతోపాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్‌ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు.
లౌకిక స్ఫూర్తికి విరుద్ధం.. 
పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్‌ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద మత స్వేచ్ఛతోపాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయని పేర్కొంది. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుందని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ఇదే చెబుతోందని, నో క్యాస్ట్‌.. నో రిలీజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్‌ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
దరఖాస్తుల్లో ఇక ప్రత్యేక కాలం…
తాజాగా హైకోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వం తీసుకునే ప్రతీ దరఖాస్తులో కులం, మతం ప్రస్తావనతోపాటు, నో క్యాస్ట్, నో రిలీజియన్‌ కాలమ్‌ కూడా ఉండనుంది. ఈమేరకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మాత్రం అమలు వాయిదా పడుతుంది. ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే నెల రోజులు ఆగాలి.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు