TS EAMCET Results 2023: ఎంసెట్ లో టాప్ 10 విద్యార్థులు వీరే..
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,01, 789 మంది పరీక్ష రాశారు. తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్ నుంచి 92.50 % మంది హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి అత్యధికంగా 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

TS EAMCET Results 2023: గత కొద్దిరోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. తెలంగాణలోని హైదరాబాదులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80% అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఓవరాల్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. టాప్ 4ల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఉండడం విశేషం.
ఇంజనీరింగ్ విభాగంలో..
సనపల అనిరుద్ -విశాఖపట్నం , ఎక్కింటిపాని వెంకట మణిందర్ రెడ్డి (గుంటూరు), చల్ల ఉమేష్ వరుణ్ కొండా(నందిగామ), అభినీత్ మాజేటి కొండాపూర్ (హైదరాబాద్), పొన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి (తాడిపత్రి ), మారదాన ధీరజ్ కుమార్ (విశాఖపట్నం ), వడ్డే షన్వితా రెడ్డి ( నల్గొండ), బోయిన సంజన (శ్రీకాకుళం), ప్రిన్స్ బ్రన్హమ్ రెడ్డి ( నంద్యాల) , మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం)లు ఉన్నారు.
అగ్రికల్చర్ & మెడికల్ విభాగంలో..
బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్(తూర్పుగోదావరి ) నశిక వెంకట తేజ ( చీరాల), సఫల్ లక్ష్మి పసుపులేటి ( సరూర్ నగర్) దుర్గంపూడి కార్తికేయ రెడ్డి (తెనాలి), బోర వరుణ్ చక్రవర్తి ( శ్రీకాకుళం), దేవగుడి శశిధర్ రెడ్డి ( హైదరాబాద్), వంగిపురం హర్షిల్ సాయి( నెల్లూరు), దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి ( గుంటూరు), గంథమనేని గిరి వర్షిత ( అనంతపురం ), న కొల్లబాతుల ప్రీతం సిద్ధార్థ్ ( హైదరాబాద్) ఉన్నారు.
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,01, 789 మంది పరీక్ష రాశారు. తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్ నుంచి 92.50 % మంది హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి అత్యధికంగా 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, 12,13,14 రోజుల్లో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించారు. వీరి కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 14న ఎంసెట్ పూర్తి కాగా.. 15న కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు.
