ట్రంప్ మెచ్చుకున్న భారతీయ సినిమాలు ఇవే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఏర్పాటుచేసిన “నమస్తే ట్రంప్” కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాల పై ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ సమావేశంలో ట్రంప్ ఏం మాట్లాడతారు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే దాని గురించి మీడియా ఫోకస్ చేసింది. అనుకున్నట్టుగానే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటగా మోడీని ప్రశంసించిన ట్రంప్, ఆ తరవాత ఇండియన్ సినిమాల గురించి […]

  • Written By: Neelambaram
  • Published On:
ట్రంప్ మెచ్చుకున్న భారతీయ సినిమాలు ఇవే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఏర్పాటుచేసిన “నమస్తే ట్రంప్” కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాల పై ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ సమావేశంలో ట్రంప్ ఏం మాట్లాడతారు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే దాని గురించి మీడియా ఫోకస్ చేసింది. అనుకున్నట్టుగానే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

మొదటగా మోడీని ప్రశంసించిన ట్రంప్, ఆ తరవాత ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు. షారుక్ నటించిన దిల్ వాలే దిల్హానియా లేజాయంగే సినిమా గురించి, అమితాబ్ హీరోగా చేసిన ఆల్ టైమ్ హిట్ సినిమా షోలే గురించి ట్రంప్ మొతేరా స్టేడియంలో పేర్కొన్నారు.
సంవత్సరానికి వెయ్యికిపైగా సినిమాలు భారత్ నుండే వస్తున్నాయని ట్రంప్ అన్నారు. ఈ విధంగా సినిమాలు రావడం వల్ల భారత్ మంచి ఆదాయాన్ని గడిస్తుందని తెలిపారు. హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి, చైనా తరువాత ఇండియా కూడా మంచి ఆధాయ వనరుగా ఉందని ట్రంప్ చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు