మొతేరా స్టేడియంలో ట్రంప్ అద్భుతమైన ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో) భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో మోతేరా స్టేడియం లో ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్”లో ప్రసంగించిన ట్రంప్ ‘నమస్తే’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తనను ఇక్కడికి ఆహ్వానించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 1.20 లక్షల మందిని ఒకేచోట చూడడం ఆనందంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మా హృదయంలో ఎప్పుడూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని […]

  • Written By: Neelambaram
  • Published On:
మొతేరా స్టేడియంలో ట్రంప్ అద్భుతమైన ప్రసంగం


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో) భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో మోతేరా స్టేడియం లో ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్”లో ప్రసంగించిన ట్రంప్ ‘నమస్తే’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తనను ఇక్కడికి ఆహ్వానించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 1.20 లక్షల మందిని ఒకేచోట చూడడం ఆనందంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మా హృదయంలో ఎప్పుడూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.

మోడీ నా ఫ్రెండ్‌ అని చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు. టీ అమ్మేస్థాయి నుంచి నరేంద్ర మోడీ ఎదిగారని అన్నారు. గుజరాతే కాదు దేశం గర్వించదగ్గ నేతగా ఆయన ఎదిగారని ట్రంప్ అన్నారు. అలాగే గత ఏడాది మోడీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారని ట్రంప్ గుర్తుచేశారు. దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని భారతీయులు ఏమైనా సాధించగలరు అనడానికి మోడీయే నిదర్శనమని అన్నారు ట్రంప్. భూ ప్రపంచం మీద మోడీ గొప్పనేతన్న ట్రంప్ చాయ్‌వాలా నుంచి ప్రధాని స్థాయికి రావడం మామూలు విషయం కాదని మరోసారి ట్రంప్ అన్నారు.

మతసామరస్యానికి భారత్ ప్రతీక అని, భిన్నత్వంలో ఏకత్వం భారత్‌ కే చెందుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంతా ముందుకు వెళ్తుందని, నిరుద్యోగం తగ్గింది, అమెరికా మిలటరీని మరింత శక్తివంతంగా మార్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రంప్ ఇండియా, అమెరికా దేశాల మధ్య ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడారు. రేపు జరగబోయే దైపాక్షిక సమావేశంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారో వాటి గురించి మాట్లాడారు. రెండు దేశాలు కలిసి ఉగ్రవాదంపై జరపబోతున్న పోరు గురించి మాట్లాడారు. ఈ విధంగా ఆది నుండి అంతం వరకు అద్భుతంగా ప్రసంగించారు ట్రంప్.